జాతీయ వార్తలు

ప్రజా వ్యతిరేక విధానాలే మూకదాడులకు కారణం : రాహుల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మూకదాడుల వంటి ఘటనలకు బిజెపి అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపి అమలుచేసిన జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి కార్యక్రమాలతో పలు చిన్నవ్యాపారాలు దెబ్బతిన్నాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, దీంతో అసహనానికి గురైన యువత ఇటువంటి దాడులను చేస్తున్నారని ఆయన వెల్లడించారు. జర్మనీలోని హాంబర్గ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బిజెపి దళితులను, మైనారిటీలను, గిరిజనులను నిందిస్తూ వారిని అభివృద్ధి ప్రక్రియ నుండి మినహాయించడంతోనే ఇటువంటి మూకదాడుల వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.