జాతీయ వార్తలు

కార్మికులకు కాంగ్రెస్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యతిరేక చట్టాలను ప్రతిఘటిస్తాం * ఐఎన్‌టియుసి ప్లీనరీలో రాహుల్ హామీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కార్మిక ప్రయోజనాలు దెబ్బతీసే తీరులో మోదీ ప్రభుత్వం రూపొందిస్తున్న చట్టాలను ప్రతిఘటించి కార్మిక ప్రయోజనాలు కాపాడటంలో వెనుకంజ వేసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రైతులను దెబ్బతీసేదిగావున్న భూసేకరణ బిల్లును అడ్డుకున్నట్టే కార్మికులకు నష్టం కలిగించే ఏ చట్టాన్నీ అమలుకాకుండా చూస్తామని ఆయన పార్టీకి అనుబంధంగావున్న ఐఎన్‌టియుసి ప్లీనరీలో ప్రకటించారు. కార్మిక చట్టాలను వీలైనంత వరకూ నిర్వీర్యం చేసి యాజమాన్య దయాదాక్షిణ్యాలపై కార్మికులు ఆధారపడేలా చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉందని ఆరోపించారు. యాజమాన్యాలకు ప్రయోజనం కలగించి కార్మికులను అణిచేసే విధంగా సంస్కరణలు చేస్తున్నందునే కార్మిక చట్టాల రూపకల్పన ఆలస్యమవుతోందని అన్నారు. దేశంలో కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, ఈరోజున్న ఉద్యోగం రేపు ఉంటుందో? పోతుందో?నన్న భయంతో బతుకుతున్నారన్నారు. కర్మాగారాల భవితవ్యం ఊగిసలాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ చెప్పుచేతల్లో నడుస్తోందన్నారు. కార్మికులు నిజాయతీ పరులుకాదు, పని దొంగలన్న అభిప్రాయంతో ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం కార్మికలోకాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్‌ను మేక్ ఇన్ ఇండియాగా మార్చి చైనాకంటే అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తామన్న ప్రధాని ప్రకటనను సమర్థిస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీన్ని ప్రకటనకే పరిమితం చేస్తూ, ఆచరణలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. భాజపా అధికారంలోవున్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తయారవుతున్న చట్టాలు కార్మికుల భవితవ్యానికి ఓ సవాలుగా మారుతున్నాయన్నారు. కార్మికులు, పారిశ్రామిక సంస్థల యాజమాన్యం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఒక న్యాయమూర్తిగా పని చేయాలని రాహుల్ సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మిక రంగం తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. ఐఎన్‌టియుసి జాతీయాధ్యక్షుడు జి సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్మికులను దెబ్బతీసే తీరులో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఐఎన్‌టియుసి దేశంలో అతి పెద్ద కార్మిక సంఘంగా గుర్తించటానికి ప్రభుత్వం అంగీకరించటం లేదని చెప్పారు. మూడుకోట్లకు మించిన సభ్యత్వం ఉందన్న సాక్ష్యాధారాలను అందించినా ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదన్నారు.