జాతీయ వార్తలు

ఆ రెండూ వేర్వేరు అంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెరాల్డ్ కేసుకు, జిఎస్‌టి బిల్లుకు సంబంధం లేదు రాహుల్ గాంధీ స్పష్టీకరణ

గౌహతి, డిసెంబర్ 12: నేషనల్ హెరాల్డ్ అంశం, జిఎస్‌టి బిల్లు అంశానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటూ, ఈ బిల్లుకు సంబంధించి ఉన్న మూడు విభేదాలను పరిష్కరించినట్లయితే పన్ను సంస్కరణలకు సంబంధించిన ఈ బిల్లుకు మద్దతు ఇస్తామనే కాంగ్రెస్ చెప్తోందని స్పష్టం చేసారు. ‘మా పార్టీ నేషనల్ హెరాల్డ్ అంశానికి, జిఎస్‌టి బిల్లుకు ముడిపెడుతోందన్న అర్థం వచ్చేట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండిటికీ ఎలాంటి సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరు అంశాలని నేను ఇక్కడ మీకు స్పష్టం చేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ శనివారం ఇక్కడ పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా తమ పార్టీ నేతలకు జారీ చేసిన సమన్లను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఇది మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు కార్యకలాపాలు సాగకపోవడంతో దేశవ్యాప్తంగా ఒకే పరోక్ష పన్ను విధానాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన వస్తు, సేవల పన్ను బిల్లును చర్చించడం ఆలస్యం అవుతోంది. ‘కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును తీసుకు వచ్చింది. అప్పట్లో మోదీజీ, జైట్లీజీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. వాళ్లు దాన్ని రకరకాల పేర్లతో పిలిచారు... అది చెత్త అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదించకూడదని అప్పుడు వాళ్లు అన్నారు’ అని రాహుల్ అన్నారు. ‘అయితే కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును తీసుకురావడానికే ప్రయత్నిస్తోంది. జిఎస్‌టి చాలా ముఖ్యం, ఎందుకంటే దానివల్ల భారత్‌లో చిక్కులు తగ్గుతాయి. అంతేకాదు అది రెడ్‌టేపిజంను తొలగిస్తుంది. జిఎస్‌టి కావాలని మేము నూటికి నూరుశాతం భావిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. జిఎస్‌టికి సంబంధించి తమ పార్టీకి బిజెపితో మూడు విభేదాలున్నాయని రాహుల్ అంటూ, అవేమిటో అందరికీ తెలుసునని చెప్పారు. బిల్లు పటిష్ఠంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, అదే వివాదానికి కారణమని కూడా ఆయన చెప్పారు. (చిత్రం) అసోంలోని బార్‌పేటలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన సద్భావనా యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ