జాతీయ వార్తలు

గూడ్సు రైలును తగులబెట్టిన జాట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ఇన్నాళ్లూ హర్యానాకే పరిమితమైన జాట్ కులస్థుల విధ్వంసకాండ ఇపుడు రాజస్థాన్‌కు విస్తరించింది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ కులస్థులు మంగళవారం రాజస్థాన్‌లోని హిలాక్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్సుకు నిప్పుపెట్టారు. పప్రిరా స్టేషన్‌లో టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ను ధ్వంసం చేసి స్టేషన్ మాస్టర్‌పై దాడి చేసి, 5వేల రూపాయల నగదును దోచుకున్నారు. 11వ నెంబర్ జాతీయ రహదారిని నిర్బంధించడంతో పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించి గాలిలోకి కాల్పులు జరిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.