క్రీడాభూమి

తొమ్మిదో ఐపిఎల్‌లో జడేజాకే రాజ్‌కోట్ ఓటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: రాజ్‌కోట్ స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజాకే ఇంటెక్స్ ఓటు వేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన జడేజా చక్కటి ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. పైగా స్థానికుడు కావడంతో అతనికే రాజ్‌కోట్ తొలి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ జరిగే తొమ్మిదో ఐపిఎల్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతున్నప్పటికీ, ఆటగాళ్లు మాత్రం పాతవారే కావడంతో, పేరు మార్పుతప్ప కొత్తదనం కనిపించకపోవచ్చన్న వాదన వినిపిస్తున్నది.
వేడి తగ్గాలంటే..
ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ‘హై-ఓల్టేజ్’ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్వతప్రాంత విడిది కేంద్రమైన ధర్మశాల చక్కగా నప్పుతుందని, ఈ మ్యాచ్‌కి ధర్మశాల సరైన వాతావరణాన్ని అందిస్తుందని బిసిసిఐ కార్యదర్శి, హిమాచాల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ థాకూర్ వ్యాఖ్యానించాడు. పిటిఐతో ఆయన మాట్లాడుతూ ‘్భరత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వేడి పుట్టింది. ఈ వేడి తగ్గాలంటే చల్లటి వాతావరణం అవసరం. ఇటువంటి వాతావరణాన్ని అందించేందుకు ధర్మశాల సరైన ప్రదేశం’ అని చమత్కరించాడు. 2007లో జరిగిన ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీ తొలి ఎడిషన్‌లో భారత జట్టు టైటిల్ కైవసం చేసుకోగా, అనంతరం రెండేళ్ల తర్వాత జరిగిన రెండో ఎడిషన్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టీమిండియాతో కొన్ని అంతర్జాతీయ వనే్డలు, ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు 2012-13 సీజన్‌లో భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడలేదు. అయితే ఐసిసి ప్రపంచ కప్ వనే్డ టోర్నమెంట్‌లో భాగంగా గత ఏడాది ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు పరస్పరం పోటీపడ్డాయి. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఈ నెలలో తటస్థ వేదిక (శ్రీలంక)లో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ రాజకీయ కారణాల రీత్యా దీనిపై అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే.