జాతీయ వార్తలు

బరువుపై రాజ్యసభలో నవ్వులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా బరువుపై నవ్వులు పూయించింది. తొలుత రేణుకా చౌదరి మాట్లాడుతూ... ‘‘ఆయనకు (వెంకయ్య) నేను ఎన్నో కిలోల ముందు నుంచి తెలుసు. సార్, చాలా మంది నా బరువు గురించి బాధపడుతున్నారు. అయితే మీరున్న స్థానంలో మీ బరువును అందరికీ సమానంగా పంచాల్సి ఉంటుంది..’’ అన్నారు. దీంతో వెంకయ్య తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘‘నేను మీకిచ్చే చిన్న సలహా ఏమిటంటే.. మీ బరువు తగ్గించుకుని పార్టీ బరువు పెంచేందుకు కృషి చేయండి..’’ అని ఛలోక్తి విసిరారు. అయితే తమ పార్టీ ప్రస్తుతం బాగానే ఉందంటూ రేణుక సమాధానం ఇవ్వడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.