హైదరాబాద్

30న మెడికల్ షాపుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 28: ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిరసిస్తూ ఈనెల 30న మెడికల్ షాపులను బంద్ చేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆదివారం పంజాగుట్టలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను అసోసియేషన్ కార్యదర్శి మురారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాల ద్వారా ఎంతో ప్రమాదకరమని అన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ ద్వారా మందులను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. ఓ వైపు వైద్యుల సూచనల ప్రకారమే మందులను విక్రయించినా చిన్నపాటి దోషాలతో మందులు మారితే పరిస్థితి ఏమిటని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాల్లో ఉదాసీనత తగదని అన్నారు. దీంతోపాటు మందుల షాపులు నడుపుతూ తాము జీవనం కొనసాగిస్తూ లక్షలాది మందికి ఉపాధిని ఇస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ విధానం ద్వారా మందుల విక్రయాలకు అనుమతులు ఇవ్వద్దంటూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు తాము బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. తమ బంద్ వల్ల ఇబ్బందులు ఎదురైతే నగరవాసులు క్షమించాలని విజ్ఞప్తి చేశారు.