హైదరాబాద్

నెలాఖరు లోగా ఆస్తిపన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకున్న జిహెచ్‌ఎంసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వర్తమాన బకాయిలను కూడా వసూలు చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు గాను గత కొద్ది సంవత్సరాలుగా ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే! సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి వరకు కూడా ఆస్తిపన్ను చెల్లింపుల పట్ల బేఫికర్‌గా ఉండే నగరవాసులు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే, కాస్త ముందుగా చెల్లించే విధంగా ప్రోత్సహించేందుకు కూడా ఈ ఎర్లీబర్డ్ స్కీం ఎంతగానో దోహదపడుతోంది. ఈ నెలాఖరు వరకు వర్తమాన సంవత్సర బకాయిలను చెల్లిస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి గురువారం వెల్లడించారు. అయితే ఈ పథకం కేవలం వర్తమాన సంవత్సరం బకాయిలున్న వారికి మాత్రమే వర్తిస్తోందని ఆయన వివరించారు. జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లోని అన్ని సిటిజన్ సర్వీసు సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, ఈసేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చునని కమిషనర్ వెల్లడించారు. దీంతో పాటు అన్ని బ్యాంకుల బ్రాంచిల్లోనూ ఆస్తిపన్ను చెల్లించవచ్చునని అధికారులు సూచించారు. అలాగే ఈ నెల 30వ తేదీలోపు ట్రేడ్‌లైసెన్సులను కూడా రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేదీ దాటితే ట్రేడ్‌లైసెన్సు రెన్యువల్ మే 1వ తేదీ నుంచి 25 శాతం జరిమానా, జూలై మాసం ఉంచి 50శాతం జరిమానాలు విధించటం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇదే తరహాలో మార్చి మాసంలో అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం ద్వారా అయిదు శాతం రాయితీ అవకాశం ఫలించి జిహెచ్‌ఎంసికి సుమారు రూ. 212 కోట్ల వరకు పన్ను వసూలైంది. ఎర్లీబర్డ్ స్కీం ముగిసిన తర్వాత పన్ను బకాయిదార్లను ఆకర్షించేందుకు జిహెచ్‌ఎంసి లక్కీ డ్రాలను కూడా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ప్రతి ఏటా సక్రమంగా పన్ను చెల్లించే బకాయిదారులను ఎంపిక చేసుకుని, వారిలో లక్కీ విజేతను ఎంపిక చేసి నగదు బహుమతులను కూడా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇపుడు తాజాగా ప్రారంభమైన 2017-18 ఆర్థిక సంవత్సరంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఎర్లీబర్డ్ స్కీం కింద రూ. 300 కోట్ల వరకు వసూలు కావచ్చునని అధికారులు భావిస్తున్నారు.