జాతీయ వార్తలు

రిజర్వేషన్ల జోలికెళ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యధావిధిగా కొనసాగుతాయ రాజ్యసభలో జైట్లీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానం కొనసాగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జైట్లీ సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడుతూ రిజర్వేషన్లు సంబంధించిన వరకు ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని గతంలోనే స్పష్టం చేశామని, ఇప్పుడూ మరోసారి చెబుతున్నామని అన్నారు. అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ పక్ష నేత రాంగోపాల్ యాదవ్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులు రిజర్వేషన్ల విధానంపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఆదివారం చేసిన ఒక ప్రకటనపై తమ అసంతృప్తి, ఆందోళనను వ్యక్తం చేశారు. సురేష్ భయ్యాజీ జోషి రాజస్థాన్‌లోని నాగోర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు న్యాయ సమ్మతమే కానీ సంపన్న వర్గాలు, కులాల వారు కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేయటం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రస్తావించాయి. ఆర్‌ఎస్‌ఎస్ మరోసారి రిజర్వేషన్లను వ్యతిరేకించిందని పలువురు ప్రతిపక్షం సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు కావటం ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టం లేదని వారు ధ్వజమెత్తారు. దీనికి మొదట పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నఖ్వి సమాధానం ఇస్తూ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని విస్పష్టంగా ప్రకటించారు. తరువాత సభలోకి వచ్చిన అరుణ్ జైట్లీ ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించిన అనుమానాలకు బదులిస్తూ రిజర్వేషన్ల విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ప్రకటనలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని జైట్లీ, నఖ్వి వివరించారు.