హైదరాబాద్

బంగారు తెలంగాణ నిర్మాణంలో రిటైర్డ్ ఉద్యోగులు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మార్చి 13: బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లారుూస్, టీచర్లు భాగస్వాములు కావలని తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లారుూస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరామ్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధనకు సంఘం అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పెన్షనర్‌లకు హెల్త్ కార్డులను జారీచేసి నగదు రహిత చికిత్స స్కీమును అమలు చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సిటిజన్ పెన్షనర్‌లందరికీ తెలంగాణ ఆర్టీసి బస్సులో 40శాతం రాయితీ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు యం.హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాములు ముదిరాజ్, వెంకట్‌రాంరెడ్డి, బండపల్లి శివ, టి.సత్యనారాయణ, ఎం.వీరయ్య పాల్గొన్నారు.