హైదరాబాద్

విద్యారంగాన్ని పటిష్ట పరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో విద్యారంగాన్ని అన్ని రకాలుగా పటిష్ఠపరిచి, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అట్టడుగువర్గాలు, పేదలకు సైతం మెరుగైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ‘విద్య’పై చర్చ జరిగిన అనంతరం సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై ఎప్పటికపుడు ఫిర్యాదులు వస్తున్నా, వారిపై ఆచితూచి వ్యవహరిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిన అవసరముందని వెల్లడించారు. ఎందుకంటే ప్రైవేటు విద్యాసంస్థల్లో 66 శాతం మంది, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 44 మంది విద్యార్థులు చదువుతున్నందున, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉందని, వాటి యాజమాన్యాలను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాల విద్య నుంచి టెక్నికల్ విద్య వరకు అన్ని రకాలుగా విద్యా రంగాన్ని పటిష్టపరిచేందుకు ఎంతో ముందుచూపుతో 2016-17 బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ. పదివేల 735 కోట్లను కేటాయించామని వివరించారు. విద్యాశాఖలోని అయిదు కీలక విభాగాలైన పాఠశాల, ఇంటర్, టెక్నికల్, ఉన్నత విద్యలకు సంబంధించిన లోటుపాట్లను కూడా బేరీజు వేసుకుని విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే వారు సుమారు 60 లక్షల మంది ఉండగా, వీరిలో 28లక్షల మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మరో 32లక్షల మంది ప్రైవేటు విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు బాగా తగ్గుతూ, ప్రైవేటు స్కూళ్లలో పెరుగుతోందన్నారు. ఇది తగ్గించేందుకు మున్ముందు ప్రభుత్వ బడులు తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్కూళ్ల రేషనలైజేషన్‌తో పాటు టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.