హైదరాబాద్

పెరుగుతున్న లై‘సెన్సు’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే జైలుకు కూడా పంపుతామని పోలీసులు జారీ చేసిన అల్టిమేటంతో నగరంలో వాహనదారుల లైసెన్సుల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే లైసెన్సులున్న వారు వాటిని రెన్యువల్ చేసుకోవటం, లేని వారు తాజాగా లర్నింగ్ లైసెన్సులు తీసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయాల వైపు పరుగులు తీస్తున్నారు.
మొత్తానికి పోలీసుల వార్నింగ్ పుణ్యమాన్ని నగరవాసుల్లో డ్రైవింగ్‌పై, డ్రైవింగ్ లైసెన్స్‌లపై సెన్సు పెరుగుతుందనే చెప్పవచ్చు. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్‌ను తప్పనిసరి చేస్తూ అక్కడక్కడ ఆకస్మిత తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేని వారిని గుర్తించి, జరిమానాలు విధించటం, సిసి కెమెరాల ద్వారా గుర్తించి లక్ష పై చిలుకు వాహనదారులపై కేసులు నమోదు చేయటంతో వాహనదారుల్లో భయం ఎక్కువైంది. దీంతో ప్రాంతీయ ఆర్టీఏ కార్యాలయాలు కూడా దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు వాహనదారులు దళారులను ఆశ్రయించి ఇరవై నాలుగు గంటల్లో లర్నింగ్ లైసెన్సులను పొందుతున్నా, ట్రాల్ కోసం ప్రత్యేకంగా సెలవులు పెట్టి మరీ హజరవుతున్నారు. రద్దీ ఎక్కువ కావటంతో ఆర్టీఏ కార్యాలయాల పనివేళలు పెంచటంతో పాటు ఆదివారం కూడా విధులు నిర్వహిస్తున్నారు. రద్దీకి తగిన విధంగా కౌంటర్ల సంఖ్యను కూడా పెంచారు. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మినెంటు లైసెన్సు ట్రాల్ కోసం స్లాట్‌లు కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయి. అంతెందుకు మన నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ కూడా మూడు రోజుల క్రితం బుల్లెట్‌పై ప్రయాణిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన హెల్మెట్ ధరించకపోవటం పట్ల జరిమానాను కూడా విధించారు. నగరంలో డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్‌లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోకముందు సుమారు 40లక్షల డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు, వీటిలో ఇరవై శాతం లైసెన్సులు భారీ వాహనాలవి కాగా, మిగిలిన లైసెన్సులన్నీ కూడా ద్విచక్ర వాహనాలకు చెందినవేనని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నిబంధనను పోలీసులు ఖచ్చితంగా అమలు చేస్తున్న మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నగరం, రంగారెడ్డి జిల్లాలోని 11 ప్రాంతీయ ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు మొత్తం 65వేల 258 లర్నింగ్ లైసెన్సులు జారీ చేశారంటే వీటి కోసం వాహనదారుల ఏ మేరకు ఎగబడుతున్నారో వేచి చూడాలి!

సికింద్రాబాద్‌లో జ్యూయలరీ షాప్‌ల బంద్
బేగంపేట, ఏప్రిల్ 2: బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకంను వెనక్కితీసుకోవాలంటు సికింద్రాబాద్‌లో బంగారు ఆభరణాల వ్యాపారులు శనివారం బంద్ పాటించారు. వ్యాపారులకు మద్దతుగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పద్మారావు వ్యాపారుల ర్యాలీలో పాలొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకంను పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ పాట్ మార్కెట్ మీదుగా జనరల్ బజార్ ఆర్‌పి రోడ్డు, ఎంజి రోడ్డు, గాంధీ విగ్రహం వరకు చేపట్టారు. ఈ ర్యాలీలో సికింద్రాబాద్ పాట్ మార్కెట్ జ్యూయలరీ ఆసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌లాల్‌జైన్, కార్యదర్శి అశోక్‌షేర్‌మల్‌జైన్, ఉపాధ్యక్షుడు మహవీర్‌జైన్, ప్రతినిధులు ఉత్తంజైన్, సురేష్‌కొటారి, శ్రీనివాస్, నవీన్‌జైన్‌తో పాటు పాట్ మార్కెట్ జనరల్‌బజార్, అమీర్‌పేట్, కుత్భుల్లాపూర్, బోడుప్పల్, మదీనా, సైదాబాద్, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ర్యాలీలో పాల్గొన్నారు.

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ఆంధ్రభూమిబ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో రంగారెడ్డి జిల్లాలో నీటి అవసరాలు, ప్రత్యామ్నాయ చర్యలపై చేపట్టే పనులపై జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నీటి అవసరం అత్యవసరంగా ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6833 చేతి పంపులు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యల పై దృష్టి పెట్టాలని చెప్పారు. రెండు నెలల వేసవి కాలం కోసం ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలో వెనుకాడదని అన్నారు. ఇప్పటికే సిఆర్‌ఎఫ్ (కరవు నివారణ నిధులు) కింద జిల్లాలో మరో 2856 పనులకు 22 కోట్ల 85 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. పనులు నిర్వహణలో జాప్యం లేకుండా అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు నీటి సమస్య పై సూచించిన వెంటనే అధికారులు తక్షణం స్పందించాలని అన్నారు. నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురుకాకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. నియోజకవర్గం వారీగా నీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టే పనుల పై స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అన్నారు. నీటి ఎద్దడి నివారణకు చేపట్టే పనుల పై సంబంధిత గ్రామసభ ద్వారా వీలైనంత త్వరగా తీర్మానం తీసుకుని పనులు ప్రారంభించాలని చెప్పారు. జిల్లాలోని ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు నూతన సిబ్బంది రాకతో పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆస్కారం ఉందని సూచించారు. 681 పనుల్లో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకుగాను 18కోట్ల 49 లక్షల 23 వేలు, 472 పనుల ద్వారా బోర్ల అద్దెకు తీసుకునేందుకు 88 లక్షల 21 వేలు, బోర్ల ఫ్లెషింగ్ చేసేందుకు 284 పనులకు 30 లక్షల 25 వేలు, బోర్లు ఫ్లెషింగ్ చేసి ఇంకా లోతు త్రవ్వేందుకు 1366 పనులకు 2 కోట్ల 25 లక్షలు, బావులు లోతు చేసేందుకు 53 పనులకు 91 లక్షల 50 వేల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ఏఎంవోహెచ్’ల అధికారాలకు కోత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: మహానగర పాలక సంస్థ సర్కిళ్ల స్థాయిలో పారిశుద్ధ్యం, వైద్యారోగ్య పరమైన విధులు నిర్వర్తించే అసిస్టెంటు మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు పనిభారాన్ని తగ్గించే విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ పరిధిలోని 24 సర్కిళ్లలో సర్కిల్‌కు ఒకరు చొప్పున వీరు ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు, బర్త్, డెత్ సర్ట్ఫికెట్ల జారీతో పాటు ట్రేడ్ లైసెన్సుల జారీ వంటి ముఖ్యమైన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుఝాము అయిదు గంటల నుంచే వీరు క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒక రకంగా వీరికి పనిభారం ఎక్కువే అయినా, అందుకు తగిన విధంగా అమ్యామ్యాలు కూడా ఉండటంతో జిహెచ్‌ఎంసిలో ఈ పోస్టుకు భలే గిరాకీ. అందుకే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ నుంచి గ్రేటర్‌కు డిప్యూటేషన్ వచ్చిన ఈ ఏఎంవోహెచ్‌లలో కొందరి డిప్యూటేషన్ గడువు ముగిసినా, వారు మాతృశాఖకు వెళ్లకుండా సీట్లలో అతుక్కుపోయారు. కొద్ది నెలల క్రితం వరకు మాతృ శాఖ నుంచి జీతం రాకున్నా, ఇక్కడే ఓ అధికారి విధులు నిర్వర్తించారంటే ఈ పోస్టులో అక్రమంగా ఆదాయం ఏ మేరకుంటుందో అంచనా వేసుకోవచ్చు. అయితే డంపర్ బిన్ల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు చెత్తను తరలించే వాహనాల నిర్వహణలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇటీవలే ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ విభాగం మొత్తాన్ని అధికారులు ప్రక్షాళన చేస్తూ మార్పులు చేశారు. జోనల్ కమిషనర్ నేతృత్వంలో చెత్తను తరలించే వాహనాలకు మరమ్మతులను ఏఎంవోహెచ్‌లే చూసుకోవాలని సరికొత్త బాధ్యతలను అంటగట్టడంతో వీరిపై పనిభారం ఏక్కువవుతుందని భావించిన అధికారులు వీరి పారిశుద్ధ్య విధులకు కోత విధించారు. అంతేగాక, ముంబై, అలహాబాదు వంటి మహానగరాల్లో మాదిరిగా పారిశుద్ధ్య పనులను ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లను నియమించుకోవాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. త్వరలో జిహెచ్‌ఎంసికి అందుబాటులోకి రానున్న అసిస్టెంటు ఇంజనీర్లలో పర్యావరణ సంబంధిత పరిజ్ఞానం ఉన్న వారిలో కొందరికి జిహెచ్‌ఎంసికి కేటాయించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరనున్నారు.