హైదరాబాద్

శ్రీసాయిధామం పీఠాధిపతి ప్రథమ ఆరాధనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 11: కీసర సమీపంలోని శ్రీసాయిధామంలో శ్రీసత్య పదానంద ప్రభూజీ ప్రథమ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. గత ఏడాది శివైక్యమైన శ్రీసత్యపదానంద ప్రభూజీ పాలరాతి విగ్రహాన్ని జ్ఞాన మందిరంలో శ్రీసాయి నామస్మరణల మధ్య కన్నుల పండువగా ఆవిష్కరించారు. సాయిధామానికి విచ్చేసిన పీఠాధిపతులు, స్వామీజీలు త్రయాహ్నిక దీక్షాహోమాలు, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్కృతి లహరి పేరుతో రూపొందించిన గురుదేవుల సంస్మరణిక పుస్తకాన్ని సాధుసంతులు ఆవిష్కరించారు. భక్తులకు స్వామీజీలు ఆశీర్వచనాలు అందజేసారు. తరలి వచ్చిన అశేష భక్తులు స్వామీజీ మహాసమాధిని దర్శించుకొన్నారు. సాధు సభలో పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడుతూ స్వామీజీలు ఆశ్రమాలకే పరిమితం కాకుండా శ్రీసత్యపదానంద ప్రభూజీ ప్రేరణతో గ్రామగ్రామాన ధర్మ ప్రచారం చేయాలని అన్నారు. హిందూ సంస్థలను సంఘటితం చేస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని ప్రారంభించాలని కోరారు. సత్యపదానంద ప్రభూజీ తుదిశ్వాస వరకు సనాతన ధర్మ పరిరక్షణకోసం పాటు పడ్డారని తెలిపారు.
కార్యక్రమంలో గండిపేట సచ్చిదానంద యోగాశ్రమం పీఠాధిపతి మాతాశ్రీ నిర్మలానంద యోగా భారతి, హైదరాబాద్‌కు చెందిన మాతా శ్రీచైత్స స్వరూపానందగిరి, గన్నవరం భువనేశ్వరీ పీఠం అధిపతి శ్రీసద్యానంద భారతి, నిజామాబాద్‌కు చెందిన దివ్యజ్ఞానానంద భారతి, విశాఖపట్టణానికి చెందిన శ్రీపరమాత్మానంద, సాయిధామం ధర్మాధికారిణి మాతా శుఖవాణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.