హైదరాబాద్

సకల కళలతో వర్ధిల్లితున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : తెలంగాణలో సకల కళలు మహోజ్వలంగా వర్ధిల్లితున్నాయని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో జాతీయ స్థాయిలో సంగీత, నృత్య ప్రదర్శనలు తారా ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో డా.వకుళాభరణం కృష్ణమోహన రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయ ఉత్సవాల్లో ఎక్కువ శాతం తెలంగాణలోని కళాకారులు పాల్గొని తెలంగాణ కళలను ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. నృత్య గురువులు రేణుకా ప్రభాకర్, పసుమర్తి విఠల్, భారతి విఠల్ సత్కరించారు. కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, ప్రముఖ సాహితీవేత్త శశిబాల, మల్కాజ్‌గిరి జడ్జ్ బూర్గుల మధుసూదన్, వేముల వెంకటేశ్, బుచ్చిరెడ్డి, నరసింగ రావు, సంస్థ అధ్యక్షుడు సంకె రాకేష్ పాల్గొన్నారు.
ప్రాచీన కళలకు ఆదరణ
కాచిగూడ, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రాచీన కళలతో పాటు బుర్రకథలకు ఆదరణ పెరుగుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ బీఎస్ రాములు అన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బుర్రకథ సప్తాహం’ మంగళవారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్ రాములు పాల్గొని కళాకారులను అభినందించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అనేక ప్రాచీన కళలను వెలికితీసి ప్రోత్సహిస్తున్నారని కీర్తించారు. ప్రముఖ బుర్రకథ కళాకారుడు ఉప్పలయ్య శిష్య బృందం ప్రదర్శించిన ‘సీతా కళ్యాణం’ బుర్రకథ ఆకట్టుకుంది. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి, నటుడు మాణిక్, గానసభ కమిటీ సభ్యుడు సిహెచ్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.
ముత్యాల సుబ్బయ్యకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, సెప్టెంబర్ 17: ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్ అకాడమి, సీల్‌వెల్ కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆత్మీయ సన్మాన సభ మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్త పాల్గొని ముత్యాల సుబ్బయ్యకు ఆత్మీయ సత్కరంతో పాటు ప్రముఖ గాయనీ పద్మశ్రీకి ‘అశ్వద్దామ’ సంగీత పురస్కారం ప్రదానం చేశారు. ముత్యాల సుబ్బయ్య అనేక కుటుంబ కథా చిత్రాలను నిర్మించి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వైకే నాగేశ్వర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కళ పత్రిక ఎడిటర్ మహ్మద్ రఫీ, బీజేపీ నాయకురాలు గీతామూర్తి, ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, పారిజాత, మోహన్ పాల్గొన్నారు.
ప్రతిభా పురస్కారాలు ప్రదానం
కాచిగూడ, సెప్టెంబర్ 17: ప్రముఖ సాహితీవేత్త పిశిపాటి దుర్గా కుమారి జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొని పురస్కారాలు ప్రదానం చేశారు. దుర్గాకుమారి సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పీ.కృష్ణమూర్తి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంఘసేవకుడు పిట్ల మనోహర్, ప్రముఖ జ్యోతిషురాలు డా. ఈడ్పుగంటి పద్మజరాణి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.