హైదరాబాద్

శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 24: శివరాత్రి పర్వదినం సందర్భంగా శిల్పారామంలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శివారాధన, కర్ణాటక గాత్ర కచేరి, శివోమ్ భరత నాట్య ప్రదర్శలు కనువిందు చేశాయి. సంగీత సిస్టర్స్‌గా పేరు గాంచిన రాజ్యలక్ష్మి, సంగీతలు ఆలపించిన శివుడి భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. వీరికి వాయిద్య సహకారం మృదంగం సుశర్ల శర్మ, విజయభాస్కర్ వయోలిన్ అందించారు. వర్ణ ఆర్ట్ అకాడమీకి చేందిన స్మితమాదవ్ శిష్యబృందం ప్రదర్శించిన శివోహమ్ నృత్య రూపకం ప్రత్యేక అకర్షణగా నిలించింది. పుష్పాంజలి, జగన్మోహిణి కృష్ణ, నందిచొళ్ళు, శివ మల్లారి, మార్గవరిత, సంస్కృతి శ్లోకం, శ్రీకాళహస్తీశ్వర స్వామి కీర్తన, మీనాక్షి పంచరత్న కీర్తన, పరిపరి పదమే తదితర అంశాలపై స్మిత మాధవ్, భార్గవి పరమేశ్వరన్, నందిత భిశ్వాస్, శాలినీ దాసరాజు, అనన్యామీనన్‌లు అద్భుతంగా నృత్యం చేసి సందర్శకులను అలరించారు. శివరాత్రి పర్వదినం కావడంతో ఉపవాస దీక్ష చేస్తున్నా భక్తులు శిల్పారామంలో సంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ ఆనందంగా గడిపారు.

టిఆర్‌ఎస్‌పై పోరుకు సిద్ధం
సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 24: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని సిఎల్పీ ఉప నాయకుడు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపేందుకు వెళ్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘట్‌కేసర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రానుందని చెప్పారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్య పర్చాలని చెప్పారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు నరేష్, నాయకులు మాధవరెడ్డి, బోనకుర్తి నరేందర్, గోవర్ధన్ ఉన్నారు.