హైదరాబాద్

మిషన్ భగీరథతో తాగునీటి ఎద్దడి నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 5: మిషన్ భగీరథతో తెలంగాణలో తాగునీటి ఎద్దడిని నివారిస్తామని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథకు రూ.1800 కోట్లు కేటాయించారని అన్నారు. తాండూరు నియోజకవర్గానికి రూ.350కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లాలోని ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో 2.80లక్షల ఎకరాలకు సాగునీరు అందించేడమే లక్ష్యమని తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశలో జిల్లాలో రూ.160కోట్లతో 600 చెరువుల పునరుద్ధరించామని, రెండో విడతలో మరో 1100 చెరువుల్లో పనులు చేపట్టేందుకు రూ.150కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. తాండూరు మండలం రాంపూర్ పెద్దచెరువుకు రూ.44లక్షలు వెచ్చించామని పేర్కొన్నారు. పెద్దెముల్ మండలం