రంగారెడ్డి

ఉద్యమ నాయకులపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, జూన్ 7: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన నాయకులు, కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం స్వరాష్ట్రంలో తాము చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనలను గుర్తించి తమకు మంచి భవిష్యత్తును అందిస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యమ నేతలకు నిరాశే మిగులుతోంది. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసిన వందలాదిమంది కార్యకర్తలు ఉండగా వారిని విస్మరించి ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఉద్యమ ఊసే తెలియని ఓ వ్యాపారవేత్త సతీమణికి పార్టీ టికెట్టు కట్టబెట్టింది. ఎన్నికల్లో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వంహించడంతో కార్పొరేటర్‌గా ఘనవిజయం సాధించిన అనంతరం పార్టీ విజయం కోసం శ్రమించిన టిఆర్‌ఎస్ కార్యకర్తలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులను కాకుండా వ్యాపారవేత్తలను తీసుకువచ్చిన అందలం ఎక్కించడంతో ప్రజాసమస్యలు పరిష్కారం కాకుండా పోవడంతో జనం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినాయకులు విషయంపై దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.