రంగారెడ్డి

ఉప్పల్ బాగాయత్ రైతుల సమస్యలపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎమ్మెల్యే భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 7: ఉప్పల్ బాగాయత్ రైతుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనాను ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. మంగళవారం రైతులతో స్వయంగా కలిసి ఇట్టి భూములకు సీలింగ్ వర్తించదని, సంబంధించిన పత్రాలను అందజేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న భూములకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అకస్మాత్తుగా జీవో నెంబర్ 98ని తెరపైకి తెచ్చి 64 ఎకరాల సీలింగ్ భూముల రైతులకు అన్యాయం చేయడం మంచిదికాదని అన్నారు. భూములకు సీలింగ్ వర్తించదని గతంలో జిల్లా అధికారులే ప్రకటించారని గుర్తుచేశారు. స్వాధీనం చేసుకున్న రైతుల మాదిరిగానే మిగితా 64 ఎకరాల పేద రైతులకు అవార్డులు జారీ చేసి అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో స్థలాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇతర దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను సైతం పరిష్కరించాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా.. పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సల్ల రాజిరెడ్డి, ధర్మారెడ్డి, మంకాల లక్ష్మణ్, నర్సింహ పాల్గొన్నారు.