రంగారెడ్డి

న్యాయ శాఖలో విభజన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 9: తెలంగాణ న్యాయవాదులు, జడ్జిలకు అన్యాయం జరిగే విధంగా న్యాయశాఖలో నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టడం సరికాదని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపూర్ణఆనంద్ అన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ విధుల బహిష్కరణ నాలుగో రోజుకు చేరిన సందర్భంగా గురువారం బార్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల ఆరోతేదీ నుండి హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయవాద సంఘాల పిలుపుమేరకు విధుల బహిష్కరణతో నిరసన తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినా పది సంవత్సరాల వరకు ఉమ్మడి కోర్టు కొనసాగాలని ఉన్నా, తెలంగాణ కోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీ విషయంలో ఓ ప్రాతిపదిక ఉందని తెలిపారు. జన్మస్థలం ఆధారం చేసుకుని, ఏడాది రెండేళ్ళలో విరమణ పొందే వారిని తెలంగాణలో ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అలా కాకుండా ఆంధ్రప్రాంతానికి చెందిన జడ్జిల కోసం ప్రతిపాదనను త్రోసిపుచ్చే విధంగా పిల్లల చదువులు, ఉద్యోగం ఆధారంగా నియమించాలని ఆప్షన్లు పెట్టుకోవడం విచిత్రకరమన్నారు. 10 ఏళ్ళు సర్వీసు ఉన్న వారికి తెలంగాణ జిల్లా, హైకోర్టులలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని నియమించడంతో తెలంగాణ జడ్జిలకు అవకాశాలు రాకపోగా, ఉన్నవారికి పదోన్నతులు రావని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ న్యాయవాదులు, జడ్జిలకు అన్యాయం జరిగే విధంగా కొత్త ఆప్షన్లతో సిద్దమైన జాబితాను ఆపాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, జడ్జిలు ఇరు ప్రాంతాల వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 13న చలో హైకోర్టు చేపట్టనున్నామని వివరించారు. హత్య కేసుల్లో ఏడేళ్ళలోపు శిక్షలకు సంబంధించి స్టేషన్ బెయిల్‌ను రద్దు చేయాలని, అవినీతి జరిగే అవకాశముందని, కోర్టుకు పంపాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు కమాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బస్వరాజ్, చౌదరి యాదవరెడ్డి, రాంచంద్‌రావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి అశోక్, న్యాయవాదులు డి.లక్ష్మణ్, కె.మాధవరెడ్డి, ఆవుటి రాజశేఖర్, బందయ్య, శ్రీలత, రమేష్‌గౌడ్, శంకరయ్య, ఎం.శ్రీనివాస్, కె.రమేష్, మేఘనాథ్‌రెడ్డి, కపిల్, రాము, నాగరాజు, వెంకటేశ్, బిఆర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.