హైదరాబాద్

వికలాంగులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 9: అర్హులైన వికలాంగులకు నిర్మించి ఉన్న ఇళ్లను వెంటనే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచారం పంచాయతీ అన్నోజిగూడ గ్రామ సమీపంలోని కెఎల్ మహీంద్రానగర్‌లో వికలాంగుల కోసం నిర్మించిన ఇళ్లను గురువారం సందర్శించి పరిశీలించారు. అర్హులైన వికలాంగులకు ఇళ్లు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో 1994 నుండి అనేక ఉద్యమాలు జరిపినట్లు తెలిపారు. సిపిఐ ఉద్యమాల ఫలితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నోజిగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 14లో ఇళ్లు నిర్మించినట్టు పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా కేటాయింపులో తాత్సారం చేస్తు వికలాంగులను ఇబ్బందులకు గురి చేయటం సమంజసం కాదన్నారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికలాంగులకు పట్టాలు ఇచ్చారని, పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇళ్లు కట్టించినప్పటికీ కేటాయించటంలో విఫలం అయ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక మార్లు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందించి ధర్నాలు చేసినట్లు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వికలాంగుల కాలనీలో ఇళ్లను గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు ఆరోపించారు. వికలాంగుల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగులకు వెంటనే కేటాయింపులు జరపాలని, లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ వికలాంగుల సమాఖ్య రాష్ట్ర నాయకుడు టి మల్కయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్టు ప్రకటనలు చేయటం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. వికలాంగులకు కేటాయించిన ఇళ్లను వారికి అప్పగించటంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వికలాంగులందరినీ సంఘటితం చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు విఎస్ బోస్, ఎం నర్సింహ్మ, ఎస్‌కె అన్వర్‌పాషా, ఏఐటియుసి జిల్లా నాయకులు కల్లూరి జయచంద్ర పాల్గొన్నారు.