రంగారెడ్డి

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 9: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ నవీన్‌కుమార్ సూచించారు. గురువారం తాండూరు డివిజన్ పట్టణ, రూరల్, బషీరాబాద్, యాలాల, పెద్దెముల్ పోలీసుస్టేషన్లు, తాండూరు ఎఎస్పీ కార్యాలయాలను సందర్శించారు. విలేఖరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను, నేరప్రవృత్తిని రూపుమాపుతామని అన్నారు. చిన్న విషయాలకు తగాదాలు, దాడులకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. కల్తీమద్యం, బెల్ట్‌షాపులను నిరోదిస్తామని చెప్పారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసి ముఖ్య కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలు, మట్కాజూదం అణిచివేస్తామని చెప్పారు. ఇసుక దోపిడీప ఉక్కుపాదం మోపుతామని అన్నారు. భూముల, ఆస్తుల దురాక్రమణదారులపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎస్పీ వెంట ఎఎస్పీ చందనాదీప్తి ఉన్నారు.