రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో బదిలీల పర్వం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: రంగారెడ్డి జిల్లాలో బదిలీల పర్వం మొదలైంది. జిల్లాలో అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలు ఉండటంతో క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులకు న్యాయం జరిగేలా ప్రతిష్టాత్మకంగా ఎ,బి,సి,డి విభాగాలుగా ప్రాంతాలను విభజించి పట్టణ ఎక్కువ కాలం పని చేసిన వారిని గ్రామీణ ప్రాంతాలకు అక్కడ పని చేసే వారిని గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అవకాశం కల్పిస్తూ బదీలీలు చేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం విఆర్‌ఒలను బదిలీ చేసేన తరహలోనే శుక్రవారం 267 మంది పంచాయితీ కార్యదర్శులను కౌనె్సలింగ్ ద్వారా బదిలీ చేశారు. వీరిలో 34 మంది 4వ గ్రేడ్ కార్యదర్శులకు పదోన్నతులు కల్పిస్తూ గ్రేడ్ 3 స్థానాల్లో కౌనె్సలింగ్ ద్వారా నియమించారు. ఆరుగురు పంచాయితీ కార్యదర్శులు కౌనె్సలింగ్‌కు గైర్హాజరు కాగా 261 మంది పంచాయితీ కార్యదర్శులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి అరుణ, జిల్లా పరిషత్ సిఇఒ రమణారెడ్డి పర్యవేక్షణలో కౌనె్సలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
వంద మంది విఆర్‌ఒలు బదిలీ ?
క్షేత్ర స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 3 సంవత్సరాలు ఒకే స్థానంలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. మూడేళ్ల కాలం పూర్తి చేసుకున్న సుమారు 106 మంది గ్రామరెవెన్యూ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. త్వరలో ఇదే పద్ధతిలో జిల్లా యంత్రాంగం బదిలీ చేయనుంది.