రంగారెడ్డి

పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 10: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన మాదిగ విద్యార్థుల చైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. అఖిలపక్షాన్ని సిఎం కేసిఆర్.. ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారం లేని సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజెపి.. ఇప్పుడు నిజాయాతీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు రెండు సార్లు కేసిఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు. చర్చిందుకు అవకాశం ఇవ్వకుంటే జూలై 18న లోయర్ ట్యాంక్‌బం నుచి సిఎం ఇంటికి మహాయాత్రను చేపడుతామని తెలిపారు. జూలై 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాత కోసం మేము సైతం పేరుతో వివిధ విభాగాలు నిరసన కార్యక్రమాలు చేస్తాయని వివరించారు. వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. హెచ్‌సియు ప్రారంభైన సైకిల్ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా మాదిగలను చైతన్య పరుస్తుందని చెప్పారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరపు లింగస్వామి, కార్యదర్శి గోవింద నరేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఓ దేలు, రాష్ట్ర కోఆర్డినేటర్ పురుషోత్తం, హెచ్‌సియు విద్యార్థి నాయకులు హరినాథ్, సుమన్, ఈశ్వర్, దొంతి ప్రశాంత్, ఉదయభాను పాల్గొన్నారు.