రంగారెడ్డి

మేడ్చల్‌కు త్వరితగతిన గోదావరి జలాలు సరఫరా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 10: మేడ్చల్ ప్రాంతానికి త్వరితగతిన గోదావరి జలాలను సరఫరా చేయాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మైనారిటీ అధ్యక్షుడు ఆజ్మత్‌ఖాన్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కుమార్ యాదవ్ తదితరులు శుక్రవారం మిషన్ భగీరథ పథకం ఎండి దానకిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. సచివాలయంలోని ఎండి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి నాయకులు గోదావరి జలాల సరఫరా విషయమై ఆయనకు వివరించారు. మేడ్చల్ పరిధిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై దృష్టిసారించాలని, పనుల వేగాన్ని పెంచాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేడ్చల్‌కు తొలి ప్రాధాన్యతగా గోదావరి జలాలను సరఫరా చేసేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయమై ఎండి దానకిషోర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు.