రంగారెడ్డి

బాలకేంద్రాలు, బాలభవన్‌లు అభివృద్ధి చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 10: బాలకేంద్రాలు, బాలభవన్‌లు అభివృద్ధి చెందాల్సిన అవసరముందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాలులో జవహర్ బాలకేంద్రం వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేట్, కార్పొరేట్‌ల కారణంగా బాలకేంద్రాలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. వేసవి శిక్షణ శిబిరాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ బాలకేంద్రం ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా ఏ సిఎం చేపట్టని కార్యక్రమాలను సిఎం కేసిఆర్ చేపడుతున్నారని పేర్కొన్నారు. బడి బయట ఉన్న పిల్లలను బడిబాట ద్వారా పాఠశాలల్లో చేర్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంతో నూతన విద్యావిధానం ప్రవేశపెడుతున్నారని తెలిపారు. చాలాగ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడంతో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని వివరించారు. నగర శివారులోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలని స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా ప్రతిగ్రామానికి 40వేల మొక్కలు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుండి ఏది ఉచితంగా వస్తుందో చూస్తున్న ప్రజలు మొక్కలు నాటడం లేదని, పెద్దలు నాటిన చెట్లే ఇప్పటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక కరవును అనుభవించాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మేలో వర్షాలు కురియడంతో కొంతైనా మేలు జరిగిందని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఇళ్ళ పెరటిలో, కాలనీలో రోడ్ల పక్కన మొక్కలు నాటాలని సూచించారు. అంతే కాకుండా ప్రభుత్వం భూగర్భ జలాలు పెరగాలని, పశువుల నీటి కోసం, దోబీలు కులవృత్తి చేసుకునేందుకు చెరువుల్లో నీరు ఉండాలని 40 నుండి 50 లక్షల రూపాయలతో మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణను చేపడుతోందని అన్నారు. ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పథకం ప్రారంభమైందని చెప్పారు. చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బాలకేంద్రాల్లో తీసుకునే శిక్షణ విద్య, ఏకాగ్రతకు ఉపయోగపడతాయని సూచించారు. శిక్షణలో ఉపాధ్యాయులను విద్యార్థులు మర్చిపోరని చెప్పారు. కళలు నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భరోసా ఇచ్చారు. బాలకేంద్రం వికారాబాద్‌కు చాలా అవసరమని స్పష్టం చేశారు.
బాలకేంద్రం సూపరింటెండెంట్ లత మాట్లాడుతూ బాలకేంద్రం స్థల పరిరక్షణకు ప్రహరీగోడ నిర్మించాలని, సంగీత వాయిద్యాలు కావాలని, బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు, మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, కౌన్సిలర్ ఎ.సుధాకర్‌రెడ్డి, ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, ఎంపిడివో ఎం.సత్తయ్య పాల్గొనగా టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్ వందన సమర్పణ చేశారు.