హైదరాబాద్

జెఎన్‌టియు ది టెక్‌ఫెస్ట్‌కువిశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జూలై 31: కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్‌లో ఇంజనీరింగ్ హబ్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగిన ది టెక్‌ఫెస్ట్ కార్యక్రమానికి విద్యార్ధుల నుండి విశేష స్పందన లభించింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లడకుండా తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఎదగాలని సూచించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టెక్ ఫెస్ట్ సిఇఓ మనోజ్‌రాజ్‌ను అభినందించారు. కార్యక్రమంలోవిద్యార్ధులు ఇండస్ట్రియల్ ఆటోమోషన్స్, రస్ట్‌బెర్రిఫి, అర్డిన్, హోమ్ ఆటోమోషన్స్, వైనక్స్ సెక్యూరిటీ, సిక్స్‌సెన్స్ టెక్నాలజీ వంటి వర్క్ షాపులకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రెజర్‌హంట్, గేమింగ్స్, ప్లాషమోబ్ వంటి వినూత్న కార్యక్రమాలపై విద్యార్ధులు ఉత్సాహాన్ని కనబరిచారు. వివిధ రకాల స్టాల్స్, నృత్య ప్రదర్శనలతో పాటు వివిధ కళాశాల నుండి వచ్చిన విద్యార్ధులు 25ప్రాజెక్టులకు పైగా ప్రదర్శనకు ఉంచారు. నూతన టెక్నాలజీ అవగాహన, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం, డిజైన్ అంశాలపై నిపుణులచే ప్రదర్శించిన ప్రజెంటేషన్స్‌కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చిన పలువురు విద్యార్థులు ఈవెంట్ కార్యక్రమం తమ ప్రతిభను వెలికితీయడానికి ఎంతో దోహదపడిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిఐఓ మనోజ్‌రాజ్ మాట్లాడుతూ ఫెస్ట్‌ను విజయవంతం చేసిన పలువురికి కృతజ్ఞతలు తెలియచేస్తూ భవిష్యత్తులో విద్యార్ధులకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో దేవరపల్లి రవి, వెంకట్‌కుమార్, హని బజాజ్, జిఆర్.రెడ్డిలతో పాటు నిర్వాహకులు నాగపవన్, ఆశ్విని, వౌనిక, భరద్వాజ్, శ్రీకాంత్, నవ్య, పృథ్వీ పాల్గొన్నారు.