జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుపి మంత్రి ఆజంఖాన్ డిమాండ్ తిప్పికొట్టిన బిజెపి

రాంపూర్ (యుపి), డిసెంబర్ 6: వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరో కొత్త వివాదానికి తెరతీశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అల్లర్లకు వారు రూపకల్పన చేశారనీ, మరికొంతమంది వాటిని అమలుచేశారని ఖాన్ ఆరోపించారు. ‘దేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నో అల్లర్లు వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఎంతోమంది వాటిని అమలుచేశారు. కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ ఉగ్ర సంస్థగా ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించిన పక్షంలో దేశంలోని ముస్లింలందరూ బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని ఖాన్ వ్యాఖ్యానించారు. ఆజంఖాన్ వ్యాఖ్యలపై బిజెపి ఎదురుదాడికి దిగింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఖాన్ ప్రయత్నిస్తున్నారని బిజెపి కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ధ్వజమెత్తారు. ఒక వర్గానికి చెందిన ప్రజల్ని బుజ్జగించడానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఖాన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రులుగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు ఆర్‌ఎస్‌ఎస్‌కు హాని కలిగించలేకపోయారని అన్నారు. ఆజంఖాన్ సహా సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌లు ఆర్‌ఎస్‌ఎస్‌ను చూసి భయపడుతున్నాయని, ఈ కారణంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారని శర్మ పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు జాతీయవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. ఆయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని ఖాన్ చేసిన వ్యాఖ్యలను బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ దీటుగా స్పందించారు. ‘ప్రపంచంలోని ఏ శక్తీ బాబ్రీని నిర్మించే సాహసం చేయబోదు. ప్రపంచమంతా బాబ్రీ బాబ్రీ అని నినదించినా ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ ఆలయం ఉండేది, ఆలయం ఉంది, ఆలయమే ఉంటుంది’ అని సాక్షి మహరాజ్ విలేఖరులకు తెలిపారు.