జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫామ్ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాకీ నిక్కరుకు బదులు బ్రౌన్ రంగు ట్రౌజర్
నాగౌర్ అఖిల భారతీయ సర్వప్రతినిధి సభలో నిర్ణయం

నాగౌర్, మార్చి 13: ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ అనగానే క్రమశిక్షణలాంటి వాటితోపాటుగా వారు ధరించే యూనిఫామ్ కూడా అందరికీ వెంటనే గుర్తుకు వస్తుంది. కాలం ఎంతగా మారినప్పటికీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఖాకీ రంగు నిక్కరు, తెల్లషర్టు యూనిఫామ్‌నే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారి యూనిఫామ్‌లో కూడా మార్పు వస్తోంది. యూనిఫామ్‌లో ఖాకీ నిక్కరు స్థానంలో కాఫీ గింజ రంగు ట్రౌజరు (బ్రౌన్ ప్యాంట్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యువకులను ఆకట్టుకోవడం కోసం కొత్త యూనిఫామ్‌గా ఖాకీ నిక్కర్ల స్థానంలో బ్రౌన్ రంగు ట్రౌజర్లను ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ ప్రదాన కార్యదర్శి భయ్యాజీ జోషీ చెప్పారు. ‘ఈ రోజుల్లో ట్రౌజర్లు సర్వ సాధారణమై పోయాయి. కాలంతోపాటు మారే మనుషులం మేము. అందువల్ల డ్రెస్ కోడ్‌ను మార్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆయన చెప్పారు. 2010లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లోనే యూనిఫామ్‌లో మార్పు అంశం చర్చకు వచ్చింది కానీ ఏకాభిప్రాయం లేని కారణంగా నిర్ణయాన్ని 2015 వరకు వాయిదా వేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఇప్పటివరకు తమ గణవేష్ (యూనిఫామ్)లో భాగంగా ఖాకీ నిక్కర్లు, మోచేతివరకు మడిచి ఉండే నిండు చేతుల తెల్లచొక్కాలు, నలుపు టోపీలు ధరించేవారు.