క్రీడాభూమి

ఆర్‌టిఐ పరిధిలోకి రావాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: లోధా కమిటీ చేసిన అత్యంత కీలక సిఫార్సులో ఇదొకటి. బిసిసిఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని లోధా కమిటీ వ్యాఖ్యానించింది. తమిళనాడులో ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున బోర్డు పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చాలాకాలంగా వాదిస్తున్నది. బోర్డును సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తీసుకురావడానికి గతంలో చాలా సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఇదే విషయంపై లోధా కమిటీ దృష్టి సారించింది. క్రికెట్‌పై ప్రజలకు ఉన్న ఆదరణ వల్లే బిసిసిఐ ఎదిగిందని, ఆర్థికంగా స్థిరపడిందని వ్యాఖ్యానించింది. ఈకారణంగానే, బోర్డును ఆర్టీఏ పరిధిలోకి చేర్చాలని సూచించింది. ఒకసారి ఆర్‌టిఐ పరిధిలోకి వెళితే, బోర్డు వ్యవహారాలన్నీ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని పాలక మండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌టిఐ పరిధిలోకి చేరకుండా తప్పించుకోవాలని అనుకుంటున్నారు. సుప్రీం కోర్టుకు దాఖలు చేయబోయే పిటిషన్‌లో ఈ అంశాన్ని కూడా పేర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది.