రుచి

డ్రై ఫ్రూట్స్‌తో ఆరోగ్యానికి రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం తీసుకునే ఆహారంలో ఎండు ఫలాలను భాగంగా చేసుకోవడంవల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఫలాలను సహజసిద్ధంగా ఎండబెట్టడంవల్ల లేదా కృత్రిమంగా యంత్రాల ద్వారా డీహైడ్రేట్ చేయడంవల్ల శుష్క ఫలాలుగా రూపొందుతాయి.
రక్తహీనతతో బాధపడేవారికి, బలహీనంగా కనిపించేవారికి, ఆకలి లేమితో సతమతమయ్యేవారికి, అధిక ఆకలితో బాధపడేవారికి డ్రైఫ్రూట్స్ శ్రేష్ఠమైన ఆహారమని చెప్పవచ్చు. శుష్క ఫలాలు భుజించినట్లయితే శరీరంలో వ్యర్థాలు తొలగిపోయి, రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్, అంజూర, కిస్‌మిస్, పిస్తా మొదలైన ఎండు ఫలాలను ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలి.
వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు అపారమని చెప్పవచ్చు. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్య సంరక్షణకు తోడ్పడతాయి. మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ఇవి ఉపయుక్తపడతాయి.
జీడిపప్పును పరిమితంగా తినడం ద్వారా కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రించబడతాయి. ఎండుద్రాక్షను ప్రతిరోజూ కొద్దిగా తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెంపొందడంతోపాటు కంటి చూపు మెరుగయ్యేందుకు దోహదపడుతుంది. అంజూర, పిస్తా మొదలైనవి తినడం అలవరచుకున్నట్లయితే రక్తహీనత, రక్తదోషాలు తొలగిపోతాయి. మధుమేహ వ్యాధిని అదుపు చేయడంలోనూ, గుండె జబ్బులు రాకుండాను సంరక్షిస్తాయి. ఇన్ని సద్గుణాలు ఉన్న డ్రైఫ్రూట్స్‌ను కొద్ది మోతాదులో నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషక విలువలు సమకూరుతాయి. పిల్లలు జంక్‌ఫుడ్ జోలికి పోకుండా నిరోధించడానికి కూడా శుష్క ఫలాలు దోహదపడతాయి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి ఇంటికి చేరుకున్న తర్వాత వీటిని ఆహారంగా ఇచ్చినట్లయితే, కడుపునిండుగా, మనసుకు తృప్తిగా అనిపించడంతో హానికరమైన పిజ్జాలు, బర్గర్లు, ఇతర నూనె వస్తువులు, మైదా ఆహారం జోలికి పోకుండా వారు బుద్ధిగా ఉండడం మీరే చూడవచ్చు. ఉద్యోగం చేసే మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్‌లో ఒక చిన్న డబ్బాలో డ్రై ఫ్రూట్స్ ఎల్లప్పుడూ ఉండేటట్లు చూసుకుంటే, ఆఫీసులో ఆకలిగా అనిపించినపుడు వీటిని కొద్దిగా తిన్నట్లయితే ఆకలి తీరడంతోపాటు, శరీరానికి అవసరమైన పోషక విలువలు అందించినట్లు అవుతుంది.
కుటుంబ సభ్యులందరూ విహార యాత్రలకు వెళ్లినపుడు, ఇతర ప్రయాణాల్లోనూ ఎండు ఫలాలను వెంట తీసుకెళితే ఇంటిల్లిపాది ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. ఎండు ఫలాలను ఆరోగ్య సంరక్షణకు తోడ్పడటంతోపాటు, సౌందర్య సంరక్షణకు కూడా దోహదపడతాయి.

-జి.అరుణ