రుచి

ఔషధాల గని.. ఉసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉసిరిలో అనేక ఔషదగుణాలున్నాయి. ఉసిరి కాయలో విటమిన్ సి ఉండటం వల్ల కళ్లకు మేలు చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచి పైత్యాన్ని తగ్గిస్తుంది. వీర్యవృద్ధిని పెంచి సంతానోత్పత్తికి తగిన బలం చేకూరుస్తుంది. ఉసిరికాయ పొట్టు, నిమ్మరసం సగభాగాలుగా కలిపి నీటితో మెత్తగా మర్దించి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే కళ్లలో చురుకుదనం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వల్ల తెల్లజుట్టు నల్లబడటమే కాక వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. ఉసిరి రసాన్ని ఆవు నేతితో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే మూర్చ వ్యాధి నయమవుతుంది. ఉసిరి పండ్ల రసంలో పంచదార లేదా నెయ్యి కలిపి తీసుకుంటే స్ర్తిలకు వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. ఉసిరి పండ్ల చూర్ణాన్ని పాలతో కలిపి రోజూ తీసుకుంటే కంఠస్వరం మెరుగుపడి కంఠ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.