రుచి

వేసవి ఫ్రూట్ కస్టర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో చల్లదనానికి పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది బలవర్థకమైన ఆహారం. వెరైటీ ఫ్రూట్ కస్టర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
బనానా కస్టర్డ్
చక్కరకేళి అరటిపళ్ళు -2
పాలు - 1/2 లీటరు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఏలకులు - 5
ఎండుకొబ్బరికోరు - 1/2 కప్పు
విధానం: చక్కరకేళి పళ్ళు తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి. పాలు మరిగించి చల్లార్చి, కస్టర్డ్ పౌడర్ కలిపి పంచదార కలుపుకోవాలి. ఎండుకొబ్బరి, ఏలకుల పొడి కలిపి అందులో అరటిపళ్ళు ముక్కలు వేసి కలిపి డీప్ ఫ్రిజ్‌లో పెట్టి నాలుగు గంటలు ఉంచిన తరువాత కప్పులో పోసి వడ్డించాలి.
డ్రైఫ్రూట్స్ కస్టర్డ్
బాదంపప్పులు - 8
జీడిపప్పులు - 24
కిస్‌మిస్‌లు - 12
పిస్తాపప్పు - 12
ఖర్జూరం ముక్కలు - 24
ఏలకులు - 5
పాలు - 1/2 లీ.
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
విధానం:ముందుగా పాలు కాచుకోవాలి. అందులో కస్టర్డ్ పౌడర్ కలిపిన తరువాత పంచదార బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, పిస్తాపప్పులు అన్నీ కలిపి చల్లార్చుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత తినాలి.
ఐస్‌క్రీమ్ కస్టర్డ్
ఐస్‌క్రీమ్ - 4 కప్పులు
కస్టర్డ్ పౌడర్ - 4 చెంచాలు
దానిమ్మ గింజలు - 1 కప్పు
యాపిల్ ముక్కలు చిన్నగా తరిగినవి - 1 కప్పు
ద్రాక్షపళ్ళ - 24
ఏలకులు - 5
కొబ్బరికోరు - 1/2 కప్పు
జీడిపప్పులు - 12
విధానం: ముందుగా ఐస్‌క్రీమ్‌లో పళ్ళ ముక్కలు కలుపుకోవాలి. ఇందులో జీడిపప్పు ముక్కలు చేర్చి కలిపి డీప్ ఫ్రిజ్‌లో పెట్టి చల్లార్చి తినాలి.
కర్డ్ కస్టర్డ్
పెరుగు - 4 కప్పులు
కస్టర్ పౌడర్ - 4 చెంచాలు
మామిడి ముక్కలు
- 2 కప్పులు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఉప్పు - 1/2 చెంచా
పచ్చిమిర్చి - 5 ముక్కలు
జీడిపప్పు - 12
విధానం:ముందుగా పెరుగుకి కస్టర్డ్ పౌడర్, పళ్ళ ముక్కలు అన్నీ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. 3 లేక 5 గంటలు. ఫ్రిజ్‌లో ఉంచి తీసి వడ్డించాలి.

- వాణీ ప్రభాకరి