రుచి

మస్తు బందోబస్తు మంచూరియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి స్టార్టర్స్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లల నుంచి కానీ, పెద్దల నోటి నుంచి కానీ వచ్చే మొదటి మాట.. మంచూరియా. ఎంత తిన్నా అలా నాన్‌స్టాప్‌గా నోట్లోకి వెళ్లి కరిగిపోతూ.. వేడివేడిగా.. కారంకారంగా.. భలేగా ఉంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటుంటారు పిల్లలు. హోటల్లో అయితే అలా ఆర్డర్ ఇచ్చి, ఇలా తినేస్తాం కానీ.. ఇంట్లో దీన్ని చేయాలంటే పెద్ద పనే.. ఎంత పెద్ద పని అయినా పిల్లల ఇష్టం, ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు కదా.. అని కొంతమంది తల్లులు మంచూరియాను ఇంట్లోనే చేయడానికి పూనుకుంటారు. పని ఎక్కువైనా ఫర్వాలేదు కానీ సరిగ్గా కుదరకపోతే మొత్తం వృథా అయిపోతుంది. మిగిలిన తయారీ అంతా తేలికే కానీ మంచూరియా బాల్స్ తయారీలో కొద్దిగా జాగ్రత్త పాటిస్తే మంచూరియాను ఇంట్లోనే తేలిగ్గా తయారుచేసుకోవచ్చు. ఇలా జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన రకరకాల మంచూరియాలను చేసేయచ్చు. మరి అవేంటో చూసేద్దామా..
కాలీఫ్లవర్‌తో..

కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: అరకిలో
మైదా: మూడు చెంచాలు
కార్న్‌ఫ్లోర్: ఒక కప్పు
కారం: ఒక చెంచా
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: ఒక చెంచా
వెల్లుల్లి: నాలుగు
అల్లం: అంగుళం
టమాటా సాస్: మూడు చెంచాలు
చిల్లీ సాస్: ఒక చెంచా
సోయాసాస్: మూడు చెంచాలు
అజినమొటో: చిటికెడు
నూనె: తగినంత
తయారుచేసే విధానం
కాలీఫ్లవర్ పువ్వుల్లా కట్ చేసుకుని వేడినీళ్లలో వేసి తీసేయాలి. వెల్లుల్లి, అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్‌లో నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇందులో మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఒక బాణలిని తీసుకుని స్టవ్‌పై ఉంచి నూనె వేసి కాగిన తరువాత కాలీఫ్లవర్‌ని బజ్జీల్లా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరే బాణలిని స్టవ్‌పై ఉంచి, అందులో రెండు స్పూన్ల నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. తరువాత ఇందులో టమోటా, చిల్లీ, సోయాసాస్‌లను వేయాలి. ఇందులోనే అజినమొటో కూడా వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన కాలీఫ్లవర్‌లను వేసి రెండు నిముషాలు ఉంచి తీసేయాలి. చివరగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్‌తో అలంకరించుకుంటే టేస్టీ టేస్టీ మంచూరియా తయారు.

చికెన్‌తో..
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: అరకిలో
సోయాసాస్: రెండు చెంచాలు
ఉల్లిపాయ: ఒకటి
కాప్సికం: ఒకటి
కార్న్‌ఫ్లోర్: రెండు చెంచాలు
మైదా: పావు కప్పు
వెల్లుల్లి రేకలు: ఎనిమిది
పచ్చిమిర్చి: ఎనిమిది
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత కారం: ఒక చెంచా
టమోటో సాస్: రెండు చెంచాలు
అల్లం: అంగుళం ముక్క
తయారుచేసే విధానం
చికెన్‌ను శుభ్రం చేసి ఉప్పు కలిపి గంటపాటు పక్కన పెట్టాలి. తర్వాత ఒక గినె్నలో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్, కారంలను బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీలపిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలి ఉంచి నూనె పోసి చికెన్‌ను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బజ్జీల్లా వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాప్సికమ్‌లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని స్టవ్‌పై ఉంచుకుని రెండు చెంచాల నూనె వేసి వెల్లుల్లి, ఉల్లి, అల్లం, కాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు, టమోటో సాస్, సోయాసాస్ కలిపి పెద్ద మంటపై రెండు నిముషాలు వేయించాలి. ఇందులోనే వేయించిన చికెన్ ముక్కలను కూడా వేసి మరో నాలుగు నిముషాలు వేయించాలి. ముక్కలకు సాస్ పట్టిన తరువాత దించేసి వేడివేడిగా వడ్డిస్తే సరి.
బేబీకార్న్‌తో..

కావలసిన పదార్థాలు
బేబీకార్న్: 12
క్యారెట్: ఒకటి
క్యాప్సికం: ఒకటి
ఉల్లిపాయ: ఒకటి
మైదా: నాలుగు చెంచాలు
నూనె: వేయించడానికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: మూడు
స్ప్రింగ్ ఆనియన్స్: అరకప్పు
జీరాపొడి: కొద్దిగా
మిరియాల పొడి: కొద్దిగా
ఉప్పు: తగినంత
సాస్ కోసం:
అల్లం రసం: ఒక చెంచా
సోయాసాస్: ఒక చెంచా
స్వీట్‌కార్న్‌సాస్: పావు కప్పు
పంచదార: అర చెంచా
వెనిగర్: ఒక చెంచా
మిరియాలపొడి: అర చెంచా
ఉప్పు: తగినంత
కార్న్‌ఫ్లోర్: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా బేబీకార్న్‌ను అరంగుళం పొడవున కట్‌చేసి వేడినీళ్లలో వేయాలి. తరువాత వీటిని వడగట్టాలి. నీళ్లన్నీ పోయిన తరువాత ఇందులో ఉప్పు, కారం, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా వేసి ముక్కలకు బాగా పట్టించాలి. బేబీ కార్న్‌కు ఉన్న తడే సరిపోతుంది. సరిపోదు అనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా చిక్కగా ఉండాలి. తరువాత బాణలిలో నూనె పోసి స్టవ్‌పై పెట్టాలి. నూనె కాగిన తరువాత బేబీకార్న్‌లను వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, సాస్‌లు వేసి పెద్దమంటపై ఒక నిముషం వేయించాలి. ఇప్పుడు వేయించిన బేబీకార్న్‌లను కలిపి ఓ నిముషం పాటు కలపాలి. తరువాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి.
కార్న్‌ఫ్లోర్‌ను కొద్దిపాటి నీళ్లలో కలిపి ఇందులో వేయాలి. ముక్కలకు ఈ సాస్ బాగా పట్టి, చిక్కగా అయిన తరువాత కొత్తిమీరతో అలంకరించుకుంటే బేబీకార్న్ మంచూరియా తయారు.

వెజ్ మంచూరియా

కావలసిన పదార్థాలు
క్యాబేజీ: 100 గ్రాములు
క్యారెట్: అర ముక్క
స్ప్రింగ్ ఆనియన్స్: అరకప్పు
మైదా: ఒక చెంచా
కార్న్‌ఫ్లోర్: మూడు చెంచాలు
మిరియాల పొడి: ఒక చెంచా
పచ్చిమిర్చి: ఒకటి
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
అల్లం తరుగు: ఒక చెంచా
వెల్లుల్లి తరుగు: ఒక చెంచా
కాప్సికమ్ తరుగు: ఒక చెంచా
ఉల్లిపాయ తరుగు: ఒక చెంచా
సోయాసాస్: రెండు చెంచాలు
పంచదార: చిటికెడు
తయారుచేసే విధానం
ఒక వెడల్పాటి గినె్నలో క్యాబేజీ, క్యారెట్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి ముద్దలా చేయాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి నూనె వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని స్టవ్‌పై ఉంచి రెండు చెంచాల నూనె వేసి అల్లం, వెల్లులి, ఉల్లిపాయ, కాప్సికమ్ తరుగులను వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, సోయాసాస్, పంచదార, ఉప్పు, కరిగించిన కార్న్‌ఫ్లోర్ వేసి రెండు నిముషాల నిముషాల తరువాత కప్పు నీళ్లు పోయాలి. ఇది కాస్త చిక్కపడ్డాక ముందుగా వేయించి ఉంచుకున్న బాల్స్ కూడా వేసి వేయించి రెండు నిముషాల తరువాత దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా తయారు.

చేపతో..

కావలసిన పదార్థాలు
ముళ్లు తీసిన చేప ముక్కలు: అరకిలో
ఉల్లిపాయ: ఒకటి
స్ప్రింగ్ ఆనియన్స్: కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
కాప్సికం: ఒకటి
అల్లం: అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
సోయాసాస్: రెండు చెంచాలు
కారం: మూడు చెంచాలు
వెనిగర్: ఒక చెంచా
అజినమొటో: చిటికెడు
మిరియాలపొడి: పావు చెంచా
పంచదార: పావు చెంచా
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కార్న్‌ఫ్లోర్: నాలుగు చెంచాలు
బియ్యప్పిండి: రెండు చెంచాలు
వంటసోడా: రెండు చిటికెలు
తయారుచేసే విధానం: కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, వంటసోడా, రెండు చెంచాల కారం, అజినమొటో, తగినంత ఉప్పులను బజ్జీలపిండిలా కలుపుకోవాలి. స్టవ్ బాణలిని పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. బజ్జీలపిండిలో చేపముక్కలను ముంచి నూనెలో వేసి దోరగా వేయించుకుని తీసి పక్కప పెట్టుకోవాలి.
తరువాత మరో బాణలిని స్టవ్‌పై ఉంచి మూడు చెంచాల నూనెను వేసి తరిగిన కాప్సికం, ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి ఒక నిముషం పాటు పెద్ద మంటపై వేయించాలి. ఇప్పుడు మంట తగ్గించి ఇందులో సోయాసాస్, కారం, వెనిగర్, అజినమొటో, మిరియాలపొడి, పంచదార వేసి వేయించాలి. తర్వాత పక్కన పెట్టిన వేయించిన చేపముక్కలను ఇందులో వేసి మంట పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టిన తరువాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.