రుచి
ఈ కేకులు కేక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రిస్‌మస్ వచ్చేసింది. కేకుల సందడి మొదలైపోయింది. పిల్లల కేరింతల మధ్య తయారుచేసిన కేకులు ఇట్టే ఎగిరిపోతున్నాయి. మరి పిల్లలు మెచ్చే, అందరికీ నచ్చే వివిధ రకాల కేకుల తయారీని చూసేద్దామా..
*
బాదాం కేక్
కావలసిన పదార్థాలు
బాదం పప్పులు: రెండు కప్పులు
మైదా పిండి: అర కప్పు
గుడ్లు: మూడు
పంచదార: ఒక కప్పు
రోజ్ వాటర్: ఒక చెంచా
వెజిటబుల్ ఆయిల్: ఒక చెంచా
తయారుచేసే విధానం
బాదం పప్పుల తొక్క తీయాలి. తరువాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో పంచదార, మైదాపిండి కూడా వేసి పొడిగా చేయాలి. గుడ్లను పగలగొట్టి పచ్చసొనలను వేరు చేయాలి. తెల్లసొనలను మైదాపిండి మిశ్రమంలో వేయాలి. ఇందులోని రోజ్ వాటర్‌ను కూడా వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమం చేతుల్లోంచి జారేట్టు కాకుండా.. కాస్త గట్టిగా ఉండేలా చూడాలి. దీన్ని కేక్ ఆకారంలో చేతులతో మార్చాలి. దీన్ని కేక్ పాన్‌పై పెట్టి ఒవెన్‌లో ఉంచాలి. ఇప్పుడు ఒవెన్‌ను 325 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచి 28 నిముషాల పాటు ఉంచాలి. అప్పుడు కేక్ బయటవైపు క్రిస్పీగా, లోపల మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు కేక్‌పై తొక్క తీసిన బాదం పప్పు చల్లి, అతిథులకు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ కేక్ చాలా బలం కూడా.
*
నట్టీ ఫ్లోరెంటైన్
కావలసిన పదార్థాలు
ఉప్పు కలిపిన వెన్న: రెండున్నర కప్పులు
పంచదార: ముప్పావుకప్పు
బాదం ముద్ద: చెంచా
మైదా: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
వేయించిన బాదం పలుకులు: రెండు చెంచాలు
వాల్‌నట్ పలుకులు: పావుకప్పు
ఎండు చెర్రీలు: పావుకప్పు
తయారుచేసే విధానం
ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ముప్పావు వంతు వెన్న, సగం పంచదార ఒక గినె్నలోకి తీసుకుని రెండింటినీ కలపాలి. అందులో బాదం ముద్ద, మైదా, బియ్యప్పిండి వేసి ముద్దలా అయ్యేవరకు కలిపి అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాత్రలో తీసుకుని ఒవెన్‌లో ఇరవై అయిదు నిముషాల వరకూ బేక్ చేయాలి. ఇప్పుడు అది కేక్‌లా తయారవుతుంది. ఇంతలో మిగిలిన వెన్న, పంచదార, విడిగా పెట్టుకున్న చెంచా మైదాను తీసుకుని కలపాలి. ఇందులో బాదం పలుకులు, వాల్‌నట్ పలుకులు, ఎండు చెర్రీలు వేసుకుని కలపాలి. కేక్‌పై ఈ మిశ్రమాన్ని పూతలా వేసి మరో పదిహేను నిముషాలపాటు బేక్ చేసుకోవాలి. దీన్ని అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి ముక్కల్లా కోస్తే సరిపోతుంది.
*ఫ్రూట్ కేక్
కావలసిన పదార్థాలు
పాలు: పావు లీటరు
కస్టర్డ్ పొడి: మూడు చెంచాలు
ఆపిల్ ముక్కలు: పావు కప్పు
అరటి ముక్కలు: పావు కప్పు
ఆరంజ్ ముక్కలు: పావు కప్పు
అనాస ముక్కలు: పావు కప్పు
సపోటా: ఒకటి
మామిడి ముక్కలు: పావు కప్పు
టూటీ ఫ్రూటీ: రెండు చెంచాలు
కేక్ ముక్కలు: ఆరు
జీడిపప్పులు: పది
బాదాం: పది
పంచదార: పావు కప్పు
ఐస్‌క్రీమ్: కప్పు
తయారుచేసే విధానం
అన్ని రకాల పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అరకప్పు పాలల్లో కస్టర్డ్ పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులు, బాదాంలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్‌పై పాలను మరగించాలి. మరిగిన పాలలో పంచదార కూడా వేసి కలపాలి. తరువాత ఈ పాలలో కస్టర్డ్ కలిపిన పాలను కూడా కలుపుతూ ఉండాలి. రెండు నిముషాల తరువాత పాలు చిక్కబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చిక్కపడ్డ పాలను చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ ముక్కను మధ్యకు కట్‌చేసి రెండుగా చేయాలి. ఒక గినె్నలో ముందుగా నాలుగు కేకు ముక్కలు పరచి పైన జీడిపప్పు, బాదం ముక్కలు వేసి వాటిపై పండ్ల ముక్కలు వేసి, వాటిపై చల్లారిన కస్టర్డ్ మిశ్రమం వేయాలి. ఇలా మళ్లీ కేకు ముక్కలు, కట్ చేసిన టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడిపప్పు ముక్కలు ఒకదానిపై ఒకటి వేసి వాటిపై కస్టర్డ్ మిశ్రమం వేసి దానిపై పండ్ల ముక్కలు వేసి వాటిపై ఐస్‌క్రీమ్ వేసి సమంగా సర్ది పైన చెర్రీ పళ్ల ముక్కలతో గార్నిష్ చేయాలి. దీన్ని ఒక్క గంట ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తరువాత సర్వ్ చేయాలి. అంతే వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
*కేక్ బాల్స్
కావలసిన పదార్థాలు
కేకు పొడి: అరకిలో
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్: 200 గ్రాములు
కకోవా పొడి: 50 గ్రాములు
కొబ్బరిపొడి: పావు కిలో
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదాం, కిస్‌మిస్..
తయారీ విధానం
ముందుగా ఓ గినె్నలో ఫ్రూట్ జామ్‌ను తీసుకుని గరిటతో గిలకొట్టినట్లు బాగా కలపాలి. అప్పుడు అది క్రీములా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో గినె్నలో కేకుపొడిని తీసుకోవాలి. దీనిలో కకోవా పొడి, కొబ్బరిపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో క్రీములా తయారైన జామ్ కూడా వేసి ముద్దలా కలపాలి. అవసరమైతే ముద్ద కట్టడానికి కొద్దిగా పాలను కూడా కలపచ్చు. దీన్ని ఓ అరగంటసేపు నాననిచ్చి తరువాత డ్రైఫ్రూట్స్ వేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని చివరగా కొబ్బరిపొడిలో దొర్లిస్తే కేక్‌బాల్స్ రెడీ.
*చాక్లెట్ కేక్
కావలసిన పదార్థాలు
మైదా: ముప్పావుకప్పు
బేకింగ్ పౌడర్: అరచెంచా
ఉప్పు: అరచెంచా
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
తీపిలేని చాక్లెట్: రెండు పెద్ద ముక్కలు
నీళ్లు: రెండు చెంచాలు
ఐసింగ్ పంచదార: అరకప్పు
డార్క్ చాక్లెట్: నాలుగు పెద్ద ముక్కలు
క్రీం చీజ్: ఒక చిన్న ప్యాకెట్
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా
తయారుచేసే విధానం
ముందుగా ఒవెన్‌ని 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి. ఒక గినె్నలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గినె్నలో గుడ్ల సొన తీసుకుని క్రీములా తయారయ్యేవరకు గిలక్కొట్టాలి. అందులో ముప్పావుకప్పు పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి. తరువాత మైదా వేయాలి. ఇప్పుడు చాక్లెట్‌ను కరిగించుకోవాలి. అంటే ఒక గినె్నలో సగం వరకూ నీళ్లు తీసుకుని స్టవ్‌పై పొయ్యిపై పెట్టాలి. అందులో చాక్లెట్ ముక్కలున్న గినె్నను ఉంచాలి. అది కరిగాక నీళ్లు, మిగిలిన పంచదార వేసి కలిపి దింపేయాలి. దీన్ని మైదా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదా చల్లిన కేక్ పాన్‌లో తీసుకుని ఒవెన్‌లో ఉంచాలి. పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది చల్లారేలోగా దీనిపై పూత తయారుచేసుకోవాలి. డార్క్ చాక్లెట్‌ను ఒక గినె్నలో తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. అది కరిగాక దింపేసి క్రీం చీజ్, వెనిల్లా ఎసెన్స్, ఐసింగ్ షుగర్ వేసి క్రీములా తయారయ్యేవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ అంతా పట్టిస్తే సరిపోతుంది. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పలుకులు వేసుకోవచ్చు.
*రెడ్ వెల్వెట్ కేక్
కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు
మొక్కజొన్న పిండి: పావుకప్పు
చాక్లెట్ పొడి: పావుకప్పు
పంచదార: అరకప్పు
కోడిగుడ్డు: ఒకటి
మజ్జిగ: పావుకప్పు
వెన్న: రెండు టేబుల్ స్పూన్లు
వెనిగర్: అరచెంచా
వంటసోడా: పావుచెంచా
ఎరుపు రంగు: చిటికెడు
వెనీలా ఎసెన్స్: అరచెంచా
తయారీ విధానం
ముందుగా ఒక గినె్నలో కోడిగుడ్డు, మైదా, మొక్కజొన్న పిండి, పంచదార, ఎరుపురంగు, చాక్లెట్ పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత ఇందులో వెనె్న, వెనీలా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న పూసిన కేకు పాత్రలో వేసి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇరవై నిముషాల పాటు బేక్ చేసుకుంటే చాలు పిల్లలు ఎంతో ఇష్టపడే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ.