రుచి

లస్కోరా ఉండ్రాళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరికోరు- 4 కప్పులు, బెల్లం 2 కప్పులు, ఏలకులు-5, నెయ్యి -5 చెంచాలు, బియ్యం రవ్వపిండి- 5 కప్పులు, ఉప్పు -1 చెంచా.

ముందుగా కొబ్బరి తురుముకి బెల్లం కొంచెం నెయ్యి చేర్చి బాణలిలో పాకం పట్టాలి. పాకం దగ్గర పడుతుండగా ఏలకులు చేర్చి కొంచెం నెయ్యి వేసి కలిపి దింపి, కోలగా బాదం కణికల్లా చేసుకొని ప్రక్కన పెట్టాలి. పెద్ద గినె్నలో 15 కప్పుల నీరు అంటే ఒక కప్పుకి 3 కప్పుల నీరు చొప్పున మిగిలిన నెయ్యి వేసి ఉప్పువేసి ఉడక నివ్వాలి. ఇది మెత్తగా అయ్యాక దింపి కొంచెం చల్లారాక ఒక కప్పు ముద్ద అరచేతిలోకి తీసుకుని దొప్పలా వత్తి పైన చేసుకొన్న కొబ్బరి లస్కోరా కఠికపెట్టి అంచులు మూసి బాదం కాయలా నొక్కాలి. ఇలాపై పిండికి 25 తీపి ఉండ్రడాళ్ళు తయారుఅవుతాయి. వీటిని ఇడ్లీ స్టాండులో రెండు ప్లేట్లు ఖాళీగా ఉంచి గినె్నలో పేర్చి- ఆవిరి మీద ఉడికించాలి. ఇవి ఆరోగ్యరీత్యా చాలా మంచివి. ఇవి ఆరోజు మాత్రమే బాగుంటాయి. నిల్వ ఉండవు.