క్రీడాభూమి

చండీమాల్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 11: శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్‌పై మిగిలిన టీ-20 మ్యాచ్‌లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేటు కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ..నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని, దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు. ఐసీసీ నిబంధన ప్రకారం 2.5.2 ప్రకారం మ్యాచ్‌లో రెండు ఓవర్లు ఆలస్యమైతే ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. మూడు ఓవర్లు అలస్యమైతే 20 శాతం కోత పడుతుంది. అదే సమయంలో కెప్టెన్‌కు పనిష్మెంట్‌గా రెండు సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. ఇది ఓ టెస్ట్, లేక రెండు వనే్డలు, లేక రెండు టీ-20ల నిషేధానికి సమానమని క్రిస్‌బ్రాడ్ తెలిపారు. దీంతో ఈనెల 12న భారత్, 16న బంగ్లాదేఓతో జరుగనున్న రెండు టీ-20 మ్యాచ్‌లకు చండీమాల్ దూరం కానున్నాడు. ఇక లంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నిబంధన ప్రకారం బంగ్లా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మహ్మదుల్లా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు రిఫరీ క్రిస్ బ్రాడ్ వివరించారు. ఏడాదిలోగా మరోసారి టీ-20ల్లో స్లో ఓవర్ రేటు నమోదైతే మహ్మదుల్లా మ్యాచ్ నిషేధానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించింది.