జాతీయ వార్తలు

సియాచిన్‌ను ఖాళీ చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత్ సియాచిన్ మంచు పర్వతాలపైనుంచి తన సైనిక బలగాలను ఉపసంహరించుకోబోదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను విశ్వసించజాలమని, భారత్ తన బలగాలను ఉపసంహరించుకుంటే సియాచిన్‌లోని వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్తాన్ ఆక్రమించుకునే అవకాశముందని ఆయన అన్నారు. సియాచిన్ మంచు పర్వతాల్లోని అత్యంత ఎత్తయిన, 23వేల అడుగుల ఎత్తులో గల సాల్టొరో రిడ్జ్ ప్రదేశం భారత్ ఆక్రమణలో ఉందని మంత్రి వివరించారు. ‘ఒకవేళ మనం ఈ ప్రదేశాన్ని ఖాళీ చేస్తే శత్రుదేశం దాన్ని ఆక్రమించుకోగలుగుతుంది. ఫలితంగా వారు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తారు. దీంతో మనం మరిన్ని ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. 1984లో జరిగిన సియాచిన్ యుద్ధం అనుభవం మనకు ఉంది’ అని పారికర్ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ‘మనం మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. మన సాయుధ బలగాలకు నేను సెల్యూట్ చేస్తాను. అయితే మనం సియాచిన్‌లోని వ్యూహాత్మక ప్రదేశాల్లో సైనికులను ఉంచాలి. వ్యూహాత్మకంగా ఇది ఎంతో ముఖ్యమైనది. ఈ సభలో ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్ మాటలు నమ్ముతారని నేను అనుకోను’ అని పారికర్ అన్నారు. ఇటీవల మంచు తుపాను వల్ల సియాచిన్‌లో మన దేశానికి చెందిన పది మంది సైనికులు సజీవ సమాధి అయిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.
సియాచిన్‌లో గత 32 ఏళ్లలో 915 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారని, అంటే సగటున ఏడాదికి 28 మంది చొప్పున మృతి చెందారని ఆయన తెలిపారు. ఈ ప్రాణ నష్టం ప్రస్తుతం ఏడాదికి పదికి తగ్గిందని ఆయన అన్నారు. సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందికి ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందుతోందని తెలిపారు. సాధారణ వైద్య సహాయంతో పోలిస్తే వీరికి ఆరు రెట్లు ఎక్కువ వైద్య సహాయం అందుతోందని చెప్పారు. మొత్తం 19 రకాల వస్త్రాలను వీరికి అందచేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు స్నో స్కూటర్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. వీరికి సరఫరాలలో ఎలాంటి కొరత లేదన్నారు. తీవ్ర ప్రతికూల ప్రదేశాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే జీతభత్యాలను గణనీయంగా పెంచుతూ ఏడో వేతన సంఘం సిఫారసు చేసిందని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతికూల ప్రదేశాల్లో పనిచేస్తున్న సిబ్బంది మృతి చెందితే రక్షణ మంత్రిత్వ శాఖ తగినంత పరిహారం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ‘పరిహారం పెంపు తథ్యం. అయితే అది ఎంత ఉంటుందనేది నేను చెప్పజాలను’ అని మంత్రి అన్నారు.