క్రీడాభూమి

కుక్‌పై ఒత్తిడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్‌పై ఒత్తిడి తీవ్రమవుతున్నది. వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకొని, సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడిన జట్టు పరువు నిలవాలంటే చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి తీరాలి. భారత్‌లో టీమిండియాను ఓడించడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ముంబయి టెస్టును గెలవడం మినహా ఇంగ్లాండ్ ముందు మరో ప్రత్యమ్నాయం లేదు. ఈ విషయం కుక్‌కు తెలియందికాదు. అది అంత సులభం కాదని కూడా అతనికి తెలుసు. అందుకే, కుక్ విపరీతమైన ఒత్తిడి మధ్య మ్యాచ్ ఆడనున్నాడు. దీనికి తోడు, భారత్‌పై గత మూడు టెస్టు సిరీస్‌ల్లోనూ విజయం సాధించిన ఇంగ్లాండ్ ‘హ్యాట్రిక్’ను నమోదు చేసింది. నాలుగోసారి సిరీస్‌ను గెలవకపోయినా, కనీసం డ్రా చేసుకున్నా పరువు నిలబడుతుంది. 2011లో ఇంగ్లాండ్ స్వదేశంలో భారత్‌ను ఓడించింది. 2012లో భారత్ పర్యటనకు వచ్చి సిరీస్‌ను సాధించింది. తిగిరి 2014లో స్వదేశంలో టీమిండియాను చిత్తుచేసింది. ఈ వరుస సిరీస్ విజయాలకు ఇప్పటికే బ్రేక్ పడింది. అయితే, ఓటమిపాలు కాకుండా తప్పించుకోవడానికి చివరి రెండు టెస్టులను గెలవగలుగుతుందా లేదా అన్నదే ప్రశ్న.
ఇంగ్లాండ్ ఆధిపత్యం!
ముంబయి: వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ సిరీస్ కంటే ముందు వరుసగా రెండు పర్యాయాలు ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసింది. ఈ మైదానంపై 1980లో జరిగిన గోల్డెన్ జూబ్లీ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 1987 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో 35 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గింది. 2006లో జరిగిన టెస్టులో ఏకంగా 212 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 2012లో మరోసారి భారత్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. ఈసారి కూడా అదే స్థాయిలో రాణిస్తుందా లేక అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న టీమిండియా చేతిలో ఓడుతుందా అన్నది ఆసక్తిని రేపుతున్నది.