క్రీడాభూమి

జూ. హాకీలో భారత్ మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 10: జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని 5-3 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్, మధ్యలో విఫలమైంది. చివరి క్షణాల్లో మరోసారి చెలరేగినప్పటికీ ఫలితం లేకపోయింది. మ్యాచ్ 10వ నిమిషంలోనే జాక్ క్లీ ద్వారా ఆ జట్టుకు తొలి గోల్ లభించింది. అయితే, భారత ఆటగాడు పర్వీందర్ సింగ్ 24వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించాడు. ఆతర్వాత కూడా దాడులను కొనసాగించిన భారత్‌కు 35వ ఇమిషంలో అర్మాన్ ఖురేషి, మరో రెండు నిమిషాల్లోనే హర్మన్‌ప్రీత్ సింగ్, 45వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్, 59వ నిమిషంలో వరుణ్ కుమార్ గోల్స్ సాధించి, భారత్‌కు తిరుగులేని విధంగా 5-1 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టారు. ప్రత్యర్థి వరుస గోల్స్‌తో కంగుతిన్న ఇంగ్లాండ్ చివరిలో దాడులకు ఉపక్రమించింది. 63వ నిమిషంలో విల్ కాల్నన్, 67వ నిమిషంలో ఎడ్వర్డ్ హొర్లెట్ గోల్స్ చేసినప్పటికీ ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాను భారత్ 5-0 తేడాతో చిత్తుచేసిన విషయం తెలిసిందే.
కాగా, ఇతర మ్యాచ్‌ల్లో, దక్షిణ కొరియాను ఆస్ట్రియా 5-2 తేడాతో ఓడించింది. కెనడా 1-3 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా 2-1 స్కోరుతో అర్జెంటీనాపై గెలిచింది.