క్రీడాభూమి

జూనియర్ హాకీ ప్రపంచ కప్ క్వార్టర్స్ పోరుకు భారత్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 14: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌ను ఢీకొనేందుకు భారత్ అన్ని విధాలా సిద్ధమైంది. పూల్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింటిలోనూ విజయాలను నమోదు చేసింది. అయితే, చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొని, ఓటమి అంచుల వరకూ వెళ్లడం, అతి కష్టం మీద బయటపడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో కెనడాను 4-0 తేడాతో చిత్తుచేసిన భారత్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 5-3 తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాను ఎంతో కష్టం మీద 2-1 స్కోరుతో ఓడించింది. చేతికి అందిన అవకాశాలను చేర్చుకోవడమేగాక, పెనాల్టీల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన కారణంగానే భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందన్నది నిజం. అయితే, లోపాలను గుర్తించామని, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భారత జూనియర్స్ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ జట్టు పటిష్టంగా ఉందన్నాడు. 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జూనియర్స్ ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి జట్టులోని ప్రతి ఆటగాడు పట్టుదలతో ఉన్నాడని పేర్కొన్నాడు. ఇలావుంటే, ప్రపంచ మేటి జట్లలో స్పెయిన్ కూడా ఒకటి కావడంతో, గురువారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కు గట్టిపోటీ తప్పదు. లోపాలను సరిచేసుకుంటూ, గతంలో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే, స్పెయిన్‌ను ఓడించి సెమీస్ చేరడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.
ఇలావుంటే, 13 నుంచి 16 వరకూ స్థానాలను ఖరారు చేసే క్లాసి ఫికేషన్ మ్యాచ్‌ల క్రాస్ ఓవర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4-2 తేడాతో ఆస్ట్రియాను ఓడించింది. న్యూజిలాండ్ 3-1 స్కోరుతో మలేసియాపై గెలిచింది. కొరియా 2-1 ఆధిక్యంతో కెనడాపై విజయం సాధించింది. ఈజిప్టును జపాన్ 1-0 తేడాతో ఓడించింది. కోజి యమాసకీ ఈ కీలక గోల్ చేశాడు.