జాతీయ వార్తలు

గోవు మూత్రంతో 8 రకాల మందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 4: గోవు మూత్రాన్ని ఇంతకాలం మనం పవిత్ర జలంగానూ, వాకిళ్లను శుభ్రం చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించుకునేవాళ్లం. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి మందులలో వాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గోమూత్రం కాలేయానికి సంబంధించిన వ్యాధుల నివారణకు, కీళ్ల నొప్పుల నివారణకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉపకరిస్తుందని ఆ రాష్ట్ర ఆయుర్వేద శాఖ పేర్కొంది. అందుకే గోవు మూత్రంతో ఎనిమిది రకాల మందులను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు డాక్టర్ ఆర్.ఆర్.చౌదరి విలేఖరులకు తెలిపారు. లక్నో, పిలిబిత్‌తోపాటు మరికొన్ని ప్రైవేటు ప్రయోగశాలల్లో ఆవు మూత్రం, పాలు, నెయ్యిని ఉపయోగించి ఆయుర్వేద మందులను తయారు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎనిమిది ఆయుర్వేద కళాశాల ఆసుపత్రుల్లో ఇప్పటికే అనేక మంది రోగులకు చికిత్సలు చేస్తున్నారు.

26వేల పోస్టుల భర్తీకి
ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తీపికబురు అందించింది. 26,502 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5లోగా ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. మెట్రిక్యులేషన్, ఐటిఐతో ఎస్‌ఎస్‌ఎల్‌సి చేసినవారు, ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన, 18-30 ఏళ్ల మధ్యవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు దఫాలుగా జరిగే సీబీటీ, కంప్యూటర్‌బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎప్పుడన్నది ఆర్‌ఆర్‌బీ నిర్ణయించి అర్హులైన అభ్యర్థులకు సమాచారం అందిస్తుంది. వివిధ రైల్వేలలో ఎక్కడెక్కడ ఎనె్నన్ని ఖాళీలున్నదీ త్వరలో ప్రకటిస్తుంది.