జాతీయ వార్తలు

తెలంగాణకు అరకొర నిధులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయింపుజరిగిందని టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావుఆరోపించారు. నిధుల విషయంలో కేంద్రంపై పోరాడి సాధించుకుంటామని శుక్రవారం ఆయన హెచ్చరించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న కేకే ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటూ ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు చేస్తున్న పోరాటంపై స్పందిస్తూ అసలు సభలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందన్న ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఒక ప్రధాన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనపై లోక్‌సభ, రాజ్యసభలో నిబంధనలు ప్రకారం 15 రోజులు చర్చ జరిగిందని కేశవరావుగుర్తుచేశారు. విభజన బిల్లు రెండు సభల్లో అశాస్ర్తియపద్ధతిలో జరిగిందని మోదీ ఎలా అంటారని కేకే నిలదీశారు. ఏన్డీయే ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను సమానంగా చూస్తామని చెప్పిన ఏపీకి 13 సంస్థలు ఇచ్చారని అన్నారు. తెలంగాణకు ఒకటైనా ఇచ్చారా?అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో ఏపీకి కేటాయించిన నిధులు జాబితాను చదివి వినిపించారు. కాని ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎయిమ్స్ కేంద్రం ప్రకటించిందని, నిధులు కేటాయింపులు ఇప్పటివరకు జరగలేదని చెప్పారు.