జాతీయ వార్తలు

‘ఆరోగ్యం’లో కేరళ భళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:దేశంలోని ఆరోగ్య రంగం భేషుగ్గా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో నిలవగా ఉత్తర ప్రదేశ్ అట్టడుగున ఉండిపోయింది. గత ఏడాదితో పోలిస్తే యూపీలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ జాబితాలో చివరిస్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ‘ఆరోగ్య సూచిక’లో ఈ వివరాలున్నాయి. కాగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, నాలుగో స్థానంలో గుజరాత్ నిలిచాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్ర ప్రదేశ్ 8వ స్థానం, తెలంగాణకు 11వ స్థానం లభించింది. ‘ఆరోగ్య రాష్ట్రాలు-అభివృద్ధి దిశగా భారత్’ అనే అంశంపై మూడు కేటగిరీల్లో నీతిఆయోగ్ ‘ఆరోగ్యసూచీ’ని రూపొందించి విడుదల చేసింది. శిశుమరణాలు, ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలు, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు, రోగనిరోధక కార్యక్రమాలవంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ ‘ఆరోగ్యసూచీ’ని రూపొందించింది.
పెద్దరాష్ట్రాల విభాగంలో రాజస్థాన్, బిహార్, ఒడిశా పేలవమైన ఫలితాలను సాధిస్తే, ఎప్పటికప్పుడు ఆరోగ్యరంగంలో మెరుగైన పరిస్థితులకోసం ప్రయత్నిస్తున్న రాష్ట్రాలుగా జార్ఖండ్, జమ్ముకశ్మీర్, యూపీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా చిన్నరాష్ట్రాల విభాగంలో మిజోరాం అగ్రస్థానం సాధించగా మణిపూర్, గోవా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో లక్ష్మద్వీప్ రెండు ప్రత్యేకతలతో అగ్రస్థానంలో నిలిచింది. నీతిఆయోగ్ పరిగణనలోకి తీసుకున్న అన్ని అంశాలలోను, ఎప్పటికప్పుడు మెరుగైన పరిస్థితుల కోసం అత్యుత్తమ ప్రయత్నాలు చేస్తున్న ప్రాంతాలలోను లక్ష్మద్వీప్ అగ్రస్థానంలో నిలిచింది.
కాగా దేశంలో ఆరోగ్యరంగం అభివృద్ధిని పరుగులుపెట్టించడానికి ‘ఆరోగ్యసూచి’ చోదకశక్తిగా నిలుస్తుందని మేధోబృందం భావిస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. ఆరోగ్యసూచి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకారం, పోటీతత్వంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సూచీ ఎంతో ప్రభావం చూపుతుందని కాంత్ అన్నారు. దేశంలో 730 ఆస్పత్రుల పనితీరు ఆధారంగా ఈ ఏడాది జూన్ నాటికి ర్యాంకులు ప్రకటిస్తామని, బాగాపనిచేసేవారిని ప్రోత్సహించడానికి, పనిచేయనివారి పనిపట్టడానికి ఈ చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరోగ్యసూచీ నిబంధనల మేరకు ఆరోగ్యరంగంలో మేలైన పరిస్థితులు కల్పించడం, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో వివిధ రాష్ట్రాల మధ్య సహకారం పెరుగుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ‘ఆరోగ్యసూచి’ విషయంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు త్వరలో తమ మంత్రిత్వశాఖ నుండి ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతీ సుదన్ వెల్లడించారు. ప్రపంచంలో ఈ తరహా కార్యక్రమం చేపట్టిన అతిపెద్ద దేశం భారత్ మాత్రమేనని, ఇతర దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రపంచబ్యాంక్ డైరక్టర్ (ఇండియా) జూనాయిడ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య ఫలితాల సాధన (70 శాతం), ప్రభుత్వ విధానాలు, సమాచారం (12శాతం), కీలక వివరాలు, విధానాల అమలు (18శాతం)లను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మొత్తంమీది ఫలితాల సాధన విషయంలో చాలా వ్యత్యాసం ఉందని, ఆరోగ్యసూచీలో మొదటి స్థానం పొందిన కేరళ ఆరోగ్యరంగం ఫలితాలు 76.55 శాతమైతే, అట్టడుగు స్థానంలో నిలిచిన యూపీ 33.69 శాతం పాయింట్లు సాధించిందని నివేదికలో పేర్కొన్నారు.
chitram....
యూపీలోని ఓ ఆసుపత్రిలో రోగుల నిరీక్షణ