Others

ఆశ ఖరీదు అణా ( గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృ: ఏడిశాడు, పద. అంతగా అయితే పీక పిసికేస్తాడు. ఆపైన ఏమీ చెయ్యలేడు గదా! అదే హాయి. ఈ క్షణాన నేను కోరుకుంటున్నదీ అదే.
ఇం: ఆ లెక్కని నేను ఏనాడూ రైలు కిందపడిపో ఉండవలసినది. ఇటువంటి వాటికి నేను విరుగుడు కనిపెట్టాను. నువ్వూ అది నేర్చుకో.
కృ: ఏవిటది?
ఇం: కష్టాలు మరీ ఎక్కువైపోయి, భరించలేనంత దుఃఖం వస్తే వెంటనే కళ్లు మూసుకొని నిద్రపో! మళ్లీ నువ్వు మేలుకొనేసరికి?
కృ: కష్టాలు కరిగిపోతాయా?
ఇం: అలా అనలేదు. కాని, మనస్సు కొంచెం తేరుకుంటుంది. కష్టాన్ని భరించే శక్తి కొంచెం కోలుకుంటుంది.
కృ: పద కాస్త బయటి ప్రపంచం రుూరాత్రి లా ఉందో చూద్దాం.. మీ అన్నయ్య ఎక్కడ తిరుగుతున్నాడో సుమా.
***
యు: వీధి యించుమించు నిర్మానుష్యంగా ఉంది. అంతటా ఒంటరితనం, నిస్ససాయం. వీది లాంతర్లు కూడా భయంగా, జాలిగా వెలుగుతన్నాయి. ఏమి రాత్రి ఇది! గాలిలో కనరాని గడసు దెయ్యాలు- భూ దివమ్ముల మద్య రుూదుతున్నయి’ అన్నాడట ఎవరో; అలాగే ఉంది.. ఆఖరిసారి భోంచేసి ఎన్నాళ్లయింది చెప్మా! రెండు రోజులయుంటుంది. ఇలా ఎన్నాళ్ళు గడుస్తుంది? ఏమో ఎవరికి తెలుసు! ఎవరో నన్ను ఓడించేశారు. మరి నెగ్గడం అసంభవం. చేతులు జోడించి నమస్కరించి, చల్లగా ఒప్కోవడమే మంచిది.
తా: ఇంకా ఇక్కడ పచార్లు చేస్తున్నావా నాయనా?.. ఏం అలా ఉలిక్కిపడ్డావ్?
యు: మీరా? ఏవిటో పరాగ్గా ఉన్నారు. రండి తాతగారూ రండి! ఎలా ఉంది యింట్లో?
తా: బయట ఎలా ఉందో యింట్లోనూ అచ్చు అలానే వుంది నువ్వు వినలేదా?
యు: లేదే! ఏమిటీ?
తా: (వ్యంగ్యంగా) ఏవిటేవిటి వెర్రివాడా! కొత్త సృష్టి, నవజీవన చైతన్యం మా కోడలు ప్రసవించింది. ఆడపిల్ల. ఏడుపు వినలేదూ? మేడ పునాదులు కదలిపోయేటట్టు ఏడుస్తోంది నాయనా!
తా: ఏవిటాశ్చర్యం?
యు: మేడలో జనాభా ఉన్నట్టుండి హఠాత్తుగా పెరిగిందన్నమాట!
తా: మరే.. ఎవరా చీకట్లో?
ఇం: నేనండీ తాతగారూ! ఇందరని.. నేనూ, కృష్ణవేణిని..
కృ: జనానా అంటున్నారేవిటి?
యు: తాతగారికి మనవరాలు పుట్టిందట.. మీ పేరు నిజంగా కృష్ణవేణేనా?
కృ: నిజమే... అదే నా పేరు- ఏం?
ఇం: మా అన్నయ్యగాని కనబడ్డాడా తాతగారూ!
తా: లేదమ్మా! ఇంకా ఇంటికి రాలే?
ఇం: రాలేదండీ! పొద్దున్ననగా యిల్లు విడిచివెళ్ళాడు. ఏవిటో, కంగారుగా వుంది.
తా: నయపడకమ్మ! వస్తాడులే!
యు: ఏలాగుంటాడండీ మీ అన్నయ్య?
ఇం: సన్నగా పొడుగ్గా ఉంటాడు. కళ్ళల్లో ఎప్పుడూ భయం పెట్టుకుని. ఏం?
యు: ఆ.. ఏం లేదు, చూస్తే పోల్చుకుందికి అడిగాను.
ఇం: మీరేనాండి మేడ గది అద్దెకు తీసుకుంది?
యు: అవునండి.
ఇం: మీ గది గోడలనిండా బొమ్మలు వేలాడదీశారే? అవన్నీ మీరు రాసినవేనా?
యు: అవన్నీ నేన సృష్టించిన పాపాలేనండి. అందుకే యిప్పుడు విచారిస్తున్నాను.
కృ: విచారందేనికి?
యు: బొమ్మలు రాయడం బదులుగా పకోడీల దుకాణం పెట్టుకున్న బాగుండిపోవునని.ఇంతకన్నా హాయిగా బతికి ఉందును.
కృ: ఓహో! అయితేమీర మా ముఠాల్లోవాళ్లేనన్నమాట, కాదనుకున్నాను.
యు: ఎంచతే అనుకున్నారూ?
కృ: ఏమో కారణం చెప్పలేను. అన్నిటికీ కారణాలు చెప్పగలమా? మీరు బొమ్మలు ఎంకు వేస్తారో చెప్పగలరా?
యు: ఆ.. ఈ ప్రపంచంలో ఏది చూసినా నాకు బాధాకరంగా కనిపిస్తుంది.ఆ బాధ నలుగురూ పోల్చుకుంటే అందరం కలిసి ఏమైనా చెయ్యగలమేమోనని ఆశ.. అవన్నీ బొమ్మలలు వేసి చూపిస్తాను- అందుకే.

- సశేషం (ఆకాశవాణి సౌజన్యంతో...)

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003