జాతీయ వార్తలు

ఐదుకు పెరిగిన మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుంజువాన్ (జమ్ము), ఫిబ్రవరి 11: జమ్ములో జరిగిన మిలిటెంట్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడి మృత దేహం లభించిందని ఆర్మీ ఆదివారం తెలిపింది. ముగ్గురు జైషే మిలిటెంట్లను మట్టుబెట్టామని, ఇద్దరు జూనియర్ అధికారులు సహా ఐదుగురు జవాన్లు ఈ దాడిలో మరణించారని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు.కాశ్మీర్ ఇన్‌ఫ్రాంట్రీ 36వ బ్రిగేడ్ స్థావరంపై దాడి చేసిన మిలిటెంట్లను మట్టుబెట్టామని ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో ఇద్దరిని శనివారంనాడే కాల్చిచంపామని, మూడో మిలిటెంట్ మృత దేహం నేడు లభించిందన్నారు. ఈ ముగ్గురూ కూడా సైనిక దుస్తుల్లోనే ఉన్నారని, సంఘటన స్థలంలో ఎకె 56రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, గ్రెనేడ్ లాంచర్, గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నామని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారని, ఆరుగురు మహిళలు, పిల్లలు సహా పది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడ్డ వారిలో ఓ గర్భిణి కూడా ఉందని, ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ 14 ఏళ్ల ఓ బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సైనిక ప్రతినిధి వెల్లడించారు. కాగా, సంఘటన స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ బృందం ఆదివారం సందర్శించి, మిలిటెంట్ దాడికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. మిలిటెంట్లు ఈ క్యాంప్‌లోకి ఎలా ప్రవేశించగలిగారు? పాకిస్తాన్ నుంచే వీరు వచ్చారా లేక స్థానిక మిలిటెంట్లేనా అన్న అంశంపై ఎన్‌ఐఎ దృష్టి పెట్టిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పదిహేను నెలల క్రితం ఇదే తరహాలో జమ్ము ప్రాంతంలో మిలిటెంట్లు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఏడుగురు జవాన్లు మరణించారు.