హైదరాబాద్

మరో మైలురాయి దాటిన మెట్రోరైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మహానగరంలో ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రాజెక్టు మరో అతి క్లిష్టమైన, ఇంజనీరింగ్ నైపుణ్యానికి సవాలుగా మారిన మరో మైలురాయి దాటింది.
ఇప్పటికే కారిడార్ 3లో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు, అలాగే కారిడార్ 1లో అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు, అలాగే ఎల్బీనగర్ వరకు అందుబాటులోకి తెచ్చే దిశగా పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగానే నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే లక్డీకాపూల్‌లోని రైల్వే బ్రిడ్జిపై నిర్మిస్తున్న మెట్రో కారిడార్ వద్ద అరుదైన ఆర్వోబి పనులు కూడా పూర్తి చేశారు. 45 టన్నుల బరువు గల 13 ప్రీకాస్టు సెగ్మెంట్లతో హ్యాంగింగ్ బ్రిడ్జి తరహాలో దీన్ని నిర్మించి, హైటేన్షన్ సప్లై స్టీల్ వైర్లను కూడా ఏర్పాటు చేశారు. ఉప్పల్ ప్రీ కాస్టింగ్ యార్డులో తయారు చేసిన ఈ సెగ్మెంట్ల తరలింపు కారణంగా సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడకుండా ఎంతో జాగ్రత్తగా రాత్రిపూట భారీ క్రేన్లు, వాహనాలతో తరలించేవారు. అత్యంత అధునాతనమైన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన ఈ ఆర్వోబి పనులు పూర్తయినట్లు ప్రకటించిన ఆయన పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ ఇంజనీర్లను మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు. ఇదే తరహాలో ఒకవైపు పిల్లర్లు నిర్మించేందుకు స్థలం లేకపోవటం, మరోవైపు బ్రిడ్జి నిర్మించాలనుకున్న ప్రాంతంలో కింద నుంచి తరుచూ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న బేగంపేటలో కూడా అంతర్జాతీయ ఇంజనీరింగ్ ప్రమాణాలతో ఇదివరకే ఓ బ్రిడ్జిని ఎల్ అండ్ టీ నిర్మించింది. లక్డీకాపూల్ సంత్ నిరంకారి భవన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద మెట్రోరైలు నిర్మాణానికి ఫౌండేషన్ వేసేందుకు స్థలం లేకపోయినా, ఒకవైపు ట్రాఫిక్ కొనసాగుతున్నా, నిర్ణీత గడువులోపు ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేశారు. ముఖ్యంగా కేవలం రాత్రిపూటే ట్రాఫిక్ బాగా తగ్గుముఖం పట్టిన తర్వాత పనులను చేపట్టారు.
బ్రిడ్జి పై నుంచి నిత్యం ట్రాఫిక్ రాకపోకలు, బ్రిడ్జి కింద సౌత్ సెంట్రల్‌రైల్వే రైళ్లురాకపోకలు సాగిస్తుండటంతో ఎంతో వ్యూహాత్మకంగా ఆర్వోబి పనులు చేపట్టామని వివరించారు. 391 అడుగుల పొడువున ఉన్న బ్రిడ్జి పనులు సజావుగా సాగేందుకు వీలుగా రైల్వే శాఖ వారానికోసారి మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసి సహకరించిందని ఎండీ తెలిపారు. త్వరలోనే ఈ కారిడార్‌లో కూడా మెట్రోరైలు రాకపోకలు సాగించేందుకు వీలుగా పనులు ఊపందుకున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు.