క్రీడాభూమి

రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్‌గా షేన్ వార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్‌కు అరుథైన అవకాశం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్‌గా అతను నియమితుడయ్యాడు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్ టైటిల్‌ను తొలిసారి దక్కించుకున్న ఘనతను వార్న్ సొంతం చేసుకున్నాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు కెప్టెన్-కోచ్‌గా వ్యవహరించిన ఆయన అందరి అంచనాలకు భిన్నంగా జట్టును విజయవంతంగా నడిపి తొలిసారిగా ట్రోఫీని అందుకున్నాడు. అయితే, అతనిపై విధించిన రెండేళ్ల నిషేధం అనంతరం మళ్లీ ఇపుడు ఐపీఎల్‌తో ముందుకు రావడం స్వంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని 48 ఏళ్ల వార్న్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ క్రీడా ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటర్‌గా అరుదైన అవకాశం దక్కించుకోవడం ద్వారా మళ్లీ ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నాడు. తనపై అభిమానం, ప్రేమతో మళ్లీ జట్టులోకి తీసుకున్నందుకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యానికి, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. 2008 నుండి 2011 వరకు జరిగిన మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు రాజస్థాన్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహించి 52 మ్యాచ్‌లలో 56 వికెట్లు తీశాడు. ప్రస్తుత జట్టులో బలమైన, ఆటపై మంచి పట్టు కలిగిన పలువురు యువ క్రికెటర్లు ఉన్నారని, వారితో కలసి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ముంబయికి చెందిన మాజీ బ్యాట్స్‌మన్ జుబిన్ బరూచా రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించనుండగా అతనితో కలసి 2008లో పనిచేసిన అనుభవంతో త్వరలో జరిగే ఐపీఎల్ టోర్నీలో పాత్ర పోషించేందుకు మళ్లీ సరైన జోడీ ఇప్పుడు కుదిరిందని వార్న్ అన్నాడు. ఇదిలావుండగా, తమ జట్టులోకి మళ్లీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ రావడం పట్ల జట్టు కో-యజమాని మనోజ్ బదాలే అన్నాడు. వార్న్‌ను గొప్ప ఆటగాడిగా పోల్చిన ఆయన తమ జట్టుతో ఆడిన సందర్భంగా సాధించిన ఘనతను ప్రస్తుతించాడు. క్రికెట్ అభిమానులంతా ఆశించినట్టుగా తమ జట్టు చాలా బలంగా ఉందని, షేన్ వార్న్ మెంటర్‌గా వ్యవహించడంతో మరింత బలపడి టైటిల్ సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నాడు. తమ ఫ్రాంచైజీకి షేన్ వార్న్ మెంటర్‌గా ఎంపిక సరైనదేనని ఆయన వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ జట్టు ఆటగాళ్ల ఎంపికలో భారీ మొత్తం వెచ్చించిన ఫ్రాంచైజీలలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్ట్రోక్‌ను 12.5 కోట్ల రూపాయలకు, భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను 11.5 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసింది.