జాతీయ వార్తలు

నేను తప్పుకుంటున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాజకీయంగా అత్యంత కీలకమైన 64 కోట్ల కుంభకోణం బోఫోర్స్ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తనంతట తానుగా తప్పుకున్నారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఖాన్విల్కర్ విచారణ నుంచి ఎందుకు తప్పుకుంటున్నదీ వివరణ మాత్రం ఇవ్వలేదు. ఈ కేసు తదుపరి విచారణకు సంబంధించి మార్చి 28న కొత్త బెంచ్ ఏర్పాటు కానుంది. బోఫోర్స్ కేసులో నిందితులపై దాఖలైన అభియోగాలను కొట్టివేస్తూ 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఈ త్రిసభ్య బెంచ్ విచారిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సైతం అప్పీల్ దాఖలు చేసింది. ఈ కేసులో పిటీషన్ దాఖలు చేయడానికి సంబంధించి అగర్వాల్‌కు ఉన్న అర్హత ఏమిటన్న దానిపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. గత పదేళ్లుగా బోఫోర్స్ కేసుపై అగర్వాల్ పిటీషన్లు వేస్తూనే వస్తున్నారు. ఎప్పుడైతే సీబీఐ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 90 రోజుల గడువులో సవాల్ పిటీషన్ వేయలేకపోయిందో, ఆ వెంటనే అగర్వాల్ థర్డ్ పార్టీ కింద తాజా అప్పీల్ దాఖలు చేశారు.