క్రీడాభూమి

వనే్డ సిరీస్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, ఫిబ్రవరి 13: దక్షిణాఫ్రికాతో ఆరు వనే్డల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి పోర్ట్ ఎలిజబెత్‌లోని సెంట్ జార్జ్ పార్క్ క్రీడా మైదానంలో జరిగిన ఐదో వనే్డలో భారత్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలి సిరీస్‌ను కోల్పోయంది. ఆరు వనే్డల సిరీస్‌లో భారత్ ఐదింటిలో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్ నామమాత్రమే.
తొలుత దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరు వనే్డల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడింట్లో విజయం సాధించిన భారత్ నాలుగో వనే్డలో ఓటమిపాలైనా ఐదో మ్యాచ్‌పై గట్టి నమ్మకం పెట్టుకుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన భారత్ కనీసం 300 వరకు పరుగులు సాధిస్తుందని అభిమానులు ఎంతో ఆశపడినా 274 పరుగులతోనే సరిపెట్టుకుంది. రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమై ఇంటా బయట అవమానాన్ని ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ ఐదో వనే్డలో మాత్రం మెరిసి విమర్శకుల నోటికి తాళం వేశాడు. జట్టులో రోహిత్ శర్మ ఒక్కడే అత్యధికంగా 115 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శిఖర్ ధావన్ గత మ్యాచ్‌లలో మాదిరిగానే తన పదునైన షాట్లతో అభిమానులను అలరిస్తాడనున్నా 8 ఫోర్ల సహాయంతో 34 పరుగులు మాత్రమే చేశాడు. రబడ బౌలింగ్‌లో పెహ్లూక్వావోకు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుతిరిగాడు. రోహిత్ శర్మ 115 పరుగులు చేసి లున్‌గీ ఎంగ్డి బౌలింగ్‌లో క్లాసీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మళ్లీ ప్రత్యర్థికి చుక్కలు చూపుతాడనుకున్న విరాట్ కోహ్లీ 54 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 36 పరుగులకే డునీ బౌలింగ్‌లో రనౌటయ్యాడు. మిడిలార్డర్‌లో అజింక్య రహానే 18 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మోర్నె మోర్కల్ బౌలింగ్ చేయగా క్లాసిన్ రనౌట్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 37 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 30 పరుగులు చేసి లున్‌గీ ఎంగ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. హార్థిక్ పాండ్య కేవలం ఒక బంతిని ఎదుర్కొని ఎంగ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 13 పరుగులు మాత్రమే చేసి ఎంగ్డి బౌలింగ్‌లో మర్‌క్రామ్‌కు క్యాచ్ ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ 20 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 19 పరుగులు, కుల్దీప్ యాదవ్ నాలుగు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. జట్టులో అత్యధికంగా 115 పరుగులు చేయగా అతని తర్వాత విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ మాత్రమే మూడు పదులు వంతున పరుగులు చేయగలిగారు. ప్రత్యర్థి జట్టులో ఎంగ్డి తొమ్మిది ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. కగిసో రబడ తొమ్మిది ఓవర్లలో 58 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.అనంతరం 275 పరుగుల లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో భారత బౌలింగ్ ధాటికి తట్టుకోలేక 201 పరుగలకు కుప్ప కూలి ఓటమిపాలైంది. ఈ జట్టులో కెప్టెన్ అయిడెన్ మర్‌క్రం 32 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 32 పరుగులు చేసి బుబ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
జీన్ పాల్ డుమిని ఐదు బంతులు ఎదుర్కొని ఒక రన్ చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఏబీ డివిలియర్స్ ఏడు బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు.
డేవిడ్ మిల్లర్ 51 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 36 పరుగులు చేసి, చాహల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్‌గా దిగి భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న హషీమ్ ఆమ్లా 92 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 71 పరుగులు చేసి హార్థిక్ పాండ్య చేతులో రనౌట్ అయ్యాడు. ఆండిలో ఫెహెలుక్యావో కేవలం మూడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కగిసో రబడ 17 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 42 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధోని స్టంప్ చేశాడు. తబైజ్ షష్మీ కుల్దీప్‌యాదవ్ బౌలింగ్‌లో పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. లుంగిసాని ఎంగ్డి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ వికెట్ల పతనం: 48-1 (శిఖర్ ధావన్, 7.2), 153-2 (విరాట్ కోహ్లీ, 25.3), 176-3 (అజింక్య రహానే, 31.5), 236-4 (రోహిత్ శర్మ, 42.2), 236-5 (హార్థిక్ పాండ్య, 42.3), 238-6 (శ్రేయాస్ అయ్యర్, 44.2), 265-7 (ఎం.ఎస్.్ధని 49.2)
దక్షిణాఫ్రికా వికెట్ల పతనం: 52-1 (ఎయడెన్ మర్‌క్రమ్, 9.4), 55-2 (జీన్ పాల్ డుమిని, 10.5), 65-3 (ఏబీ డివిలియర్స్, 12.5), 127-4 (డేవిడ్ మిల్లర్, 26.4), 166-5 (హీషీమ్ ఆమ్లా, 34.3), 168-6, (ఆండిలో ఫెహెలుక్యావో 35.3), 196-7 (కగిసో రబడ, 41.2), 197-8 (హెన్రిచ్ క్లాసెన్, 41.4), 197-9 (తబ్రైజ్ షష్మీ, 41.5), 201-10 (మోర్నె మోర్కల్, 42.2).
chitram...
వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సెంచరీ వీరుడు రోహిత్ శర్మ