హైదరాబాద్

గొర్రెలు, చేపల పెంపకం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెలు మరియు చేపల పెంపకం పథకం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌లను పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర సంబంధిత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, చేపల పెంపకంపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గొల్ల, కురుమలకు ఇప్పటివరకు రాష్ట్రంలోని 2 లక్షల 8 వేల 400 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా 43.76 లక్షల జీవాలను పంపిణీ చేశామని అన్నారు. రూ.2600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జిల్లాలోని సంచార పశు వైద్య అంబులెన్స్‌ల పనితీరును పర్యవేక్షించాలని, రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్టైలో పశుగ్రాసం పెంపకాన్ని విరివిగా ప్రోత్సహించాలని, 75 శాతం సబ్సిడీలపై అందిస్తున్న పశుగ్రాసం పెంపకంపై రైతులకు అవగాహన కల్పించి సొంత భూమి ఉన్న రైతులు గ్రాసాన్ని పెంచుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఇరిగేషన్, హార్టికల్చర్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. వేసవిలో పశుగ్రాసం నీటి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న గొర్రెలకు షెడ్లు, నీటి తొట్ల నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఫిషరీస్ మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మాణాలకు, స్థలాలను గుర్తించాలన్నారు. మత్స్య శాఖ చేపల ఔట్లెట్స్ ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్ రావు మాట్లాడుతూ గొర్రెల పంపిణీ విషయంలో జిల్లాలో ఇప్పటి వరకు 20 నుంచి 25 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించామని అన్నారు. 368 గ్రామాల నుంచి 20000 మంది వరకు పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 206 గ్రామాలలో గొర్రెల పంపిణీ పూర్తిచేశామని, 250 గ్రామాలను ఈ నెలాఖరు వరకు పూర్తిచేసి మిగతా 118 గ్రామాలను మార్చి వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 11000 మందిని ఎంపిక చేసామని వీరిలో 6200 మంది మాత్రమే డీడీలను చెల్లించారని, మిగిలిన వారిని కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తామని అన్నారు. జిల్లాకు మొదట కేటాయించిన దావనగీర్, చిత్రదుర్గ్ జిల్లాల్లో కావాల్సినన్ని గొర్రెల లభ్యం కాకపోవడం కూడా లక్ష్యానికి దూరంలో ఉండడానికి మరో కారణమని తెలిపారు. గత వారంలో ఇంకా కొన్ని జిల్లాలను కేటాయించడంతో త్వరలోనే పురోగతి సాధిస్తామని అన్నారు. జిల్లాలో ఇప్పుడు ప్రతి మండలం నుంచి ఒక టీమ్ ప్రొక్యూర్‌మెంట్ ఏరియాలో ఉందని, ఈనెల 1000 యూనిట్లు, వచ్చే నెల వరకు 2500 యూనిట్లు పూర్తి చేసి లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కేవీఎల్ ఎన్‌రావు, ఏడీ ఫిషరీస్ రాజారామ్, ఆర్‌డీఓ ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.